పవన్‌కు ఇష్టంలేనంత మాత్రాన.. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాదా?

టీడీపీలో సమర్థ నాయకత్వం కరువైందనే... జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ సంప్రదిస్తోంది

  టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి   

విజ‌య‌వాడ‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇష్టంలేనంత మాత్రాన.. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాదా? అని టీడీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. జనం మద్దతుతో వైయ‌స్ఆర్‌ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీని నాశనం చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా అది సాధ్యం కాదని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 చంద్రబాబుకు వారసుడిగా ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందేమోనని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  తెలుగుదేశంలో సరైనా నాయకత్వం ఉందో లేదోనని ఆ పార్టీ నాయకులే ఆలోచించుకోవాలని సూచించారు.

చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయ్యారని బీజేపీ భావిస్తుండడం వల్లే అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయినట్లు ప్రజల్లో పలు రకాల అనుమానాలు వస్తున్నాయని వెల్లడించారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top