నారాయణ దీక్షితులు మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతాపం

 
తిరుప‌తి:  విశ్రాంత ప్రధాన అర్చకుడు నారాయ‌ణ దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు.        తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విశ్రాంత  ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు మరణ వార్త తనకు ఆవేదన కలిగించిందని సుబ్బారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దశాబ్దాలపాటు ఆయన శ్రీవారి సేవలో తరించారని చైర్మన్ కొనియాడారు.  దీక్షితులు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నిబ్బరం ప్రసాదించాలని కోరారు.
 
 మంత్రి వెల్లంపల్లి సంతాపం
విజయవాడ: తిరుమల మాజీ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు మృతి పట్ల మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణ దీక్షితులు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు  మనోధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి వెల్లంపల్లి ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

Back to Top