నవంబర్‌ 14న చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ప్రారంభిస్తాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: నవంబర్‌ 14వ తేదీ (బాలల దినోత్సవం)న తిరుపతిలో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మొదట బర్డ్‌ ఆస్పత్రిలోని భవనాల్లో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తామని, ఆ తరువాత చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ కోసం రెండేళ్లలో కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో విశాఖలో కూడా చిన్న పిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top