బాబు నయవంచన యాత్రను నమ్మొద్దు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

తూర్పుగోదావరి: చంద్రబాబు నయవంచన యాత్రను ప్రజలు నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు ఇంకా యాత్రలని బయల్దేరాడని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల మేలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top