సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తో త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వ‌ర‌ణ్ గుప్తా భేటీ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను  త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా క‌లిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం 

 సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం 

 తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ. 1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన వరుణ్‌ గుప్తా, ఈ ప్లాంట్‌ వల్ల 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడి .
ఈ సమావేశంలో  సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్‌.రాజీవ్‌ కృష్ణ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top