పూటకో మాటమార్చే వ్యక్తిని ప్యాకేజీ స్టారే అంటారు

మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పవన్‌ జీవో తీసుకొస్తాడా..?

ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినప్పుడు, ముద్రగడను అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఏమైంది..?

చంద్రబాబు, పవన్‌పై పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజం

న‌గ‌రి: జనవాణి కార్యక్రమానికి ఎక్కడా ర్యాలీ నిర్వహించని పవన్‌.. విశాఖలో మాత్రం ఎందుకు చేపట్టారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్‌ ఒరిజినల్‌ క్యారెక్టర్‌ ఏంటో నిన్న పబ్లిక్‌గా బట్టబయలైందన్నారు. మొన్నటి వరకు అమరావతి టీడీపీ రాజధాని అన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చాడని, పూటకో మాట మార్చే వ్యక్తిని ప్యాకేజీ స్టార్‌ అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.  
 
మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ జీవో తీసుకొస్తాడా..? అని ప్రశ్నించారు.  గతంలో 23 మంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను లాక్కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఏమైందని చంద్రబాబును మంత్రి రోజా ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఏమైంది..? కాపు నేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయించినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఏమైంది..? అని నిలదీశారు. కాపులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రాధాన్య ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఇళ్లు కూడా చంద్రబాబు, పవన్‌కు హైదరాబాదే దిక్కు అని అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top