నేడు సీఈసీతో వైయ‌స్ఆర్‌ సీపీ బృందం భేటీ

టీడీపీ శ్రేణుల అరాచకాలపై ఫిర్యాదు
 

హైదరాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ మాజీ ఎంపీలతో కూడిన బృందం ఎన్నికల కమిషన్‌ను సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ చూసుకుని రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడింది చాలక మళ్లీ ఢిల్లీ వెళ్లి యాగీ చేస్తున్న తీరుపై వారు కమిషన్‌ కు ఫిర్యాదు చేయబోతున్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలపై పోలింగ్‌ రోజున, పోలింగ్‌ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తారు. 
 

Back to Top