నేడు వైయస్‌ జగన్‌ ప్రచారం షెడ్యూల్

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు(8 వ తేదీన) 3 జిల్లాల్లో పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో, 11.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, మధ్యాహ్నం 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఎన్నికల ప్రచారం చేస్తారు.  

వైయస్‌ షర్మిల యాత్ర షెడ్యూల్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(8వ తేదీన) వైయఎస్‌ షర్మిల పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. రాజమండ్రి రూరల్‌, రాజమండ్రి సిటీ, విశాఖ ఈస్ట్‌, సౌత్‌, నార్త్‌, వెస్ట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి రూరల్‌ నియోజవర్గంలో, 11.15 గంటలకు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. వైయస్ విజయమ్మ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

Back to Top