పొగాకు షెడ్ల‌కు నిప్పు

బాధిత రైతుల‌కు మాజీ ఎమ్మెల్యే కాట‌సాని ప‌రామ‌ర్శ‌

నంద్యాల జిల్లా: గడివేముల మండలం పై బోగుల గ్రామంలో పొగాకు షెడ్లు కు  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. బుధ‌వారం రాత్రి రైతులు వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, సూరి కి సంబంధించిన పొగాకు పంట  (7 పొగాకు షెడ్లు) కాలి బూడిద అయ్యింది.  అగ్ని ప్ర‌మాదంలో దాదాపు 12 లక్షలు విలువ చేసే పంట కాలిపోయింది. చేతికి వచ్చిన పంట 2,3 రోజుల్లో అమ్ముకొనే క్ర‌మంలో ఇలా బుడిద కావ‌డం ప‌ట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  గ్రామానికి వెళ్లి బాధిత రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. రైతుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

Back to Top