విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ

వైయస్‌ఆర్‌ జిల్లా: ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు. పులివెందులలో వైయస్‌ విజయమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది.. ఎలాంటి ప్రభుత్వం కావాలని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకొని మళ్లీ స్వర్ణయుగాన్ని తెచ్చుకోవాలి. 

Back to Top