తాడేపల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నలుకుర్తి రమేష్, విజయవాడ నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు కలిసి సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్ల పాటు కొనసాగేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకోవడం ఆయనకు మాపై ఉన్న ప్రేమకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.