టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

నంద్యాల‌:  శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని సిద్ధాపురం గ్రామంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. సిద్దాపురం ఉప స‌ర్పంచ్ రామ‌న్న‌, ఆయ‌న బంధువులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు బుధ‌వారం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీడీపీ కాటికి సిద్ధం అయిన పార్టీ...  దింపుడు కల్లం ఆశతో ఉంది ...జగనన్న సంక్షేమ పథకాల హోరు కు ప్రతిపక్ష టీడీపీ వైపు చూసే వాళ్ళే లేర‌న్నారు. టీడీపీ మహానాడు లో సొంత భజన చేసుకుంటూ దింపుడు కల్లం ఆశ తో బతుకుతోంద‌ని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనతో ప్రతి కుటుంబం చల్లగా ఉంటోందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయ‌న్నారు. గడప గడప కు వెళ్తుంటే, లబ్ది పొందని కుటుంబం ఒక్కటీ కనిపించలేద‌ని సంతృప్తి వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు గ్యారంటీ అని ధీమా వ్య‌క్తం చేశారు. జగనన్న ప్రభుత్వాన్ని వదులుకునేందుకు ఎవరూ సిద్ధం గా లేర‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నా కుటుంబ స‌భ్యులేన‌ని, ఇక్క‌డ ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. పార్టీలో చేరిన వారిలోరమణయ్య , జయ రంగులరాజు,  పీట్ల విజయ్, ఇరగదిండ్ల ఏడుకొండలు, ఇరగ దిండ్ల చిన్న ఓబులేసు, పెద్ద ఓబులేసు, దండు కలా శీను, తమ్మి శెట్టి రాజు, దండికల నాగేశ్వర్ రావు, పీట్ల రాముడు, పీట్ల వేణు, దండకల నాగన్న, పీట్ల వెంకట సుబ్బమ్మ, జడ్పీటీ రాజు, పీట్ల మద్దమ్మ, జయ రంగుల రాములమ్మ, పీట్ల శివ, పీట్ల వెంకటేష్, పీట్ల మల్లి త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top