తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు వెంకట రమణ, గుర్రాజుకు కండువాలు కప్పి పార్టీలోకి సీఎం వైయస్ జగన్ ఆహ్వానించారు. 2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. నిన్ననే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. సయ్యపరాజు గుర్రాజు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. వీరిరువురూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు.