వైయస్ఆర్ జిల్లా : కూటమి ప్రభుత్వంలో పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ప్రతీచోటా వైయస్ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్మలమడుగులో టీడీపీ మూకలు.. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త హనుమంతరెడ్డిపై దాడులు చేశారు. జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త హనుమంతరెడ్డిపై టీడీపీ మూకలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. తాజాగా ఓ స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని హనుమంతపై మారణాయుధాలతో దాడి చేశారు. పచ్చ మూక దాడిలో హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు. అయితే, గతంలో కూడా టీడీపీ నేతలు హనుమంతపై దాడులు చేశారు. 2019లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన కేసులో హనుమంత రాజీకి రావాలని బెదిరింపులకు గురిచేశారు. నాడు రాజీకి రాలేదని కోర్టు వద్దే హనుమంతపై పచ్చ నేతలు హత్యాయత్నం చేశారు. తాజాగా ఎల్లో మూక చేసిన దాడిలో మరో ముగ్గురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు.