పోలీస్‌స్టేషన్‌లోనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి

శ్రీ‌కాకుళం జిల్లాలో బరితెగించిన పచ్చ గూండాలు 

శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. పోలీస్‌స్టేషన్‌లోనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు వద్దని వారించినా వినకుండా టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ నేతలు దాడి  చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.  

మరోవైపు, సనపల సురేష్‌పై టీడీపీ నేతలు కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని గతంలో సురేష్‌పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే కూన రవికుమార్ దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తనను వేధిస్తున్నారని సురేష్‌ అంటున్నారు.

విచారణకంటూ పిలిచి సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒత్తిడితోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు సురేష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

 
 

Back to Top