కొన‌సాగుతున్న టీడీపీ అరాచ‌క కాండ‌

వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
 

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. 

Back to Top