వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడి

కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం
 

విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్‌ అనుచరులు దాడికి దిగారు.
కర్రలు, బీర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పవన్‌, రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..
వైయ‌స్ఆర్‌సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు.

Back to Top