అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కెబినెట్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సచివాలయంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. మొదట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులకు గవర్నర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు 1. ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట) 2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి) 3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం) 4. అవంతి శ్రీనివాస్ (భీమిలి) 5. పిల్లి సుభాష్‌చంద్రబోస్ (ఎమ్మెల్సీ) 6. కురసాల కన్నబాబు(కాకినాడ రూల్) 7. పినిపే విశ్వరూప్ (అమలాపురం) 8. ఆళ్ల నాని (ఏలూరు) 9. తానేటి వనిత (కొవ్వూరు) 10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట) 11. వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ) 12. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు) 13. బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు) 14. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కుర్నూలు - డోన్) 15. గుమ్మనూరు జయరాం (ఆలూరు) 16. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు) 17. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు) 18. అంజాద్ భాషా (కడప) 19. శంకర్ నారాయణ (పెనుకొండ) 20. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ) 21. మోపిదేవి వెంకటరమణ 22. ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం) 23. కొడాలి నాని (గుడివాడ) 24. పేర్ని నాని(మచిలీపట్నం) 25. మేకపాటి గౌతమ్ రెడ్డి(ఆత్మకూరు)