బాబు బరితెగింపు మాటలే.. ఆయనను రాజకీయ సమాధి చేస్తాయి

మీడియా స‌మావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున 

వైయ‌స్ జగన్ గారి సభకొచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూలిజనమా?

మరి, మీ కూటమి సభలకు వచ్చేది పెత్తందార్లా..?

చంద్రబాబుది ఆదినుంచీ పెత్తందారీ మనస్తత్వమే..

దళితులు, బీసీలంటేనే బాబుకు గిట్టదు

బాబు ప్రాయశ్చిత్తం పడే రోజులు దగ్గరపడ్డాయి

మంత్రి మేరుగు నాగార్జున

 తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు బరితెగింపు మాటలే.. ఆయనను రాజకీయ సమాధి చేస్తాయ‌ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చ‌రించారు. చంద్రబాబూ.. నువ్వు రాజకీయాల్లో అహంకార స్వభావంతో ఉండి బరితెగించి మాట్లాడి ఈరోజు పల్లెల్లోకొచ్చి ఓట్లు ఎలా అడుగుతావు..? ఏ మొఖం పెట్టుకుని బీసీ, ఎస్సీ కాలనీలకు వెళ్తావు..? ఏ మొఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో డ్రైవింగ్‌ వృత్తి చేసుకునే డ్రైవర్లను ఓట్లు అడగగలవు..? బీసీలను దళితులను అనరాని మాటలు అని .. వారిని సందర్భానుసారం చులకనతో ఏహ్యభావంతో చూసిన చంద్రబాబుకు ఓటడిగే అర్హత లేదు. వారి ఓట్లపై ఆయనకెలాంటి హక్కులేదన్నారు. తాడేపల్లి వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుది ఆదినుంచీ పెత్తందారీ మనస్తత్వమే..
చంద్రబాబు అనే వ్యక్తి రాజకీయాల్లో విపరీతమైన అహంకారి. పెత్తందారీ మనస్తత్వం కల్గిన వ్యక్తి. ఆయనవన్నీ పెత్తందారీ పోకడలని మేం మొదట్నుంచీ చెప్పుకొస్తూనే ఉన్నాం. మనిషిని మనిషిగా చూడలేని దుర అహంకారి. ప్రజల బతుకు, వారి జీవనవిధానంపై వేటు వేయడంలో బాబు సిద్ధహస్తుడు. చిన్న కులాలంటే ఆయనకు చాలా తేలిక స్వభావం. 

దళితులు, బీసీలంటేనే ఆయన గిట్టదుః
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని అవమానించాడు. ఆ మాటపై ఆయన ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఏనాడూ పశ్చాత్తాపం చెందిన సందర్భంలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు.. ఆ మాటపైనా బీసీలకు ఏనాడూ ఆయన క్షమాపణ చెప్పిందీలేదు. బీసీలు జడ్జీలుగా పనికిరారని అన్నాడు. బీసీల అంతు చూస్తానన్నాడు. ఇన్ని మాటలన్న వ్యక్తి.. ఎక్కడా తాను తప్పు చేశానని చెప్పడం లేదు. ఆయన స్వభావం అది. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇవ్వన్నీ మరిచిపోలేని ఘట్టాలు.
ఆయన ఈ మధ్యకాలంలో అణగారిన, వెనుకబడిన కులాలపై ఇంకా బరితెగించి మాట్లాడుతున్నాడు. మా అధినాయకుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అతి సామాన్యులకూ ఎమ్మెల్యే సీట్లిచ్చి పోటీకి నిలబెడితే టిప్పర్‌ డ్రైవర్లూ ఎమ్మెల్యే అభ్యర్థులా..? వేలిముద్రగాళ్లంటూ దళితులను ఎగతాళి చేశాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కూలిజనమా బాబూ..?
 - తమ రెక్కల కష్టం మీద తాము బతికే వారిని పట్టుకుని ‘కూలిజనం’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. ఈ మాట ఎంత దారుణం..? ఎంత అహంభావం..? జగన్‌మోహన్‌రెడ్డి గారి సభలకు వచ్చేది కూలిజనమా..? నీ సభలకు వచ్చేది పెత్తందారీ ధనవంతులా..? అంటే, నీ దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల్లోని పేదలంతా కూలిజనమా..? మరి, ఈ కూలిజనం బతికినన్నాళ్లూ కూలోళ్లుగానే బతకాల్నా..? కష్టపడి బతికే వాళ్లంటే.. నీకంత తేలికస్వభావమా..? చిన్నచూపా?. రేపు ఎన్నికల్లో మాత్రం ఇదే కూలిజనం ఓట్లు నీకు కావాల్నా..? నీ భావజాల రాజకీయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని తెలుసుకో.. 

బాబు ప్రాయశ్చిత్తం పడే రోజులు దగ్గరపడ్డాయిః
అణగారిన, బడుగు బలహీనవర్గాలపై నువ్వెంత నోరు పారేసు కుంటున్నావో.. అంతేస్థాయిలో ఏదొకరోజుకు నువ్వు తప్పకుండా ప్రాయాశ్చితం అనుభవించడం ఖాయం. ఒకపక్కన జగన్‌మోహన్‌రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ.. వాళ్ల స్థితిగతులు మెరుగుపడాలని పనిచేస్తూ ఉన్నారు. వారి జీవనశైలిలో మార్పులు తెచ్చి పేద కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ.. దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి గారు అహోరాత్రులు కష్టపడి కృషిచేస్తుంటే.. నువ్వేమో వారిని చులకనగా చూస్తూ, మళ్ళీ వాళ్ల ఓట్లతోనే లబ్ధిపొందాలనుకుంటున్నావా..? అధికారంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనేంటో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ నాటకాలేంటో ప్రజలందరికీ తెలుసునని గ్రహించు చంద్రబాబు. 

బీసీ, దళితవాడల్లో ఓటడిగే హక్కు చంద్రబాబుకు లేదుః
చంద్రబాబూ.. నువ్వు రాజకీయాల్లో అహంకార స్వభావంతో ఉండి బరితెగించి మాట్లాడి ఈరోజు పల్లెల్లోకొచ్చి ఓట్లు ఎలా అడుగుతావు..? ఏ మొఖం పెట్టుకుని బీసీ, ఎస్సీ కాలనీలకు వెళ్తావు..? ఏ మొఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో డ్రైవింగ్‌ వృత్తి చేసుకునే డ్రైవర్లను ఓట్లు అడగగలవు..? బీసీలను దళితులను అనరాని మాటలు అని .. వారిని సందర్భానుసారం చులకనతో ఏహ్యభావంతో చూసిన చంద్రబాబుకు ఓటడిగే అర్హత లేదు. వారి ఓట్లపై ఆయనకెలాంటి హక్కులేదు. 

బాబు అహంకార మాటలే..అతని పాలిట తూటాలై బుద్ధిచెబుతాయిః
ఎన్నికలనగానే రకరకాల వేషాలతో నటించే చంద్రబాబు మేకవన్నె రాజకీయాన్ని ప్రజలంతా అర్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా గతంలో చంద్రబాబు దాష్టీకాలను గుర్తుకు తెచ్చుకుని.. నీవల్ల మాకేం మేలని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. దళితులు, బీసీల ఆత్మగౌరవం నిలిపిన జగన్‌మోహన్‌రెడ్డి గారికే మేమంతా మద్ధతు పలుకుతామంటూ బాబు మొఖమ్మీదనే చెబుతారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, డ్రైవర్లు, కష్టంమ్మీద బ్రతికే వారిని ఏమేం మాటలు అహంకారంతో పలికాడో.. అవే మాటలు తూటాలై ఎన్నికల్లో ఓట్లరూపంలో గుచ్చుకుని ఆయనకు బుద్ధిచెప్పడం ఖాయం.  

వైయ‌స్ జగన్‌గారిని మళ్లీ సీఎం చేసేందుకు అంతా సిద్ధంః
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఆయా వర్గాల కోసం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన చేసిన ఘనత జగన్‌గారికి దక్కుతోంది. రాష్ట్రంలో ప్రజలందరికీ రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమాన్ని పైసా లంచం లేకుండా సచివాలయ వ్యవస్థతో నేరుగా జమచేసిన ముఖ్యమంత్రి జగన్‌గారు మాత్రమే. అందులోనూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేసి.. వారి అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి పిల్లల చదువుల్లోనూ అనూహ్య మార్పులు తెచ్చారు. ఇంగ్లీషు మీడియం విద్యాబోధనతో నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ల రూపురేఖల్ని మార్చి అందరి మన్ననలు పొందారు జగనన్న. పేదలకు వైద్యం ఖరీదు కాకూడదంటూ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు చేరువలో క్లినిక్‌లు పెట్టి ఆదుకున్న వైద్యరుషి ఆయన. రాష్ట్రంలో 31 లక్షల మంది ఆడబిడ్డలకు ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణాలతో నిలువనీడను అందించిన మహానుభావుడు ఆయన. అలాంటి విప్లవాత్మక దార్శనీకుడైన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డినే మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు. 

Back to Top