కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాం.. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశాం

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  

వైయ‌స్‌ జగన్ నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1గా నిలిచాం

   బాబు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది

 నారా లోకేషా.. నందమూరి లోకేషా..!?

గుంటూరు: కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాం.. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  నిన్న, ఇవాళ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ జరుగుతోంది. పార్టీ ప్లీనరీ సమావేశాలకు లక్షలాదిమంది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  కుటుంబసభ్యులు, పార్టీ అభిమానులు, లక్షలాదిమంది జగనన్న సైనికులు, పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. వైయస్సార్‌ సీపీ అసాధారణ పరిస్థితుల్లో ఆవిర్భవించింది. 2009లో వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి మరణం తర్వాత ఈ రాష్ట్రానికి మళ్లీ వైయస్సార్‌ ఆశయాలతో పాటు ఆయన పాలన అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. ఆ రోజుల్లో అధికారంలో ఉ‍న్న కాంగ్రెస్‌ పార్టీని, సోనియాగాంధీని ఎదిరించాలంటే అంతా  భయపడుతున్న తరుణం. అలాంటి 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించిన మొనగాడు ఒక్క వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మాత్రమే.

- రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేశారు. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేశాం.  ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది కూడా లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు గత ప్లీనరీలో నవరత్నాలను రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తామని, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, పేదలకు మేలు చేస్తామని మాటిచ్చి 75 సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశంలో అమలు చేయనన్ని పథకాలను అమలు చేశారు.  ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు ఎవరూ లేరు. అది ఒక్క వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తప్ప.

- 2017లో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్రంలోని అయిదు కోట్ల మందికి మాటిచ్చి,  ఆ వాగ్దానాలను 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే నూటికి 95శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాది.

- దేశంలో అనేక జాతీయ, రాజకీయ పార్టీలను చూశాం. గతంలో మేనిఫెస్టోలు అంటే ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు, ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చే హామీలుగా మాత్రమే చూశాం. అదే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఏ జిల్లా, మండలానికి, గ్రామానికి వెళ్లినా, ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా ఎన్నికలలో మేనిఫెస్టోను ప్రభుత్వ కార్యాలయాల గోడల మీద అంటించి, ఇవి మా వాగ్దానాలు.. ఇవి మేం చేశాం.. అని చెప్పుకుంటున్న ఘనత ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది.

- ఒక లక్షా 60వేల కోట్ల రూపాయలను అనేక సంక్షేమ పథకాల ద్వారా, డీబీటీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందించాం. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులను ముఖ్యమంత్రిగారు పంచేస్తున్నారంటూ విమర్శించే, నిత్యం ఏడ్చే ప్రతిపక్షాన్ని ఇప్పుడు చూస్తున్నాం.  ఇందులో, ఒక్క రూపాయి అన్నా అవినీతి జరిగిందని ఏ ప్రతిపక్షం అయినా ఆరోపించగలిగిందా అనేదానిపై సమాధానం చెప్పాలి. గడిచిన మూడేళ్లలో రెండేళ్లు కోవిడ్‌తో పోరాటం చేశాం. కోవిడ్‌ వల్ల ప్రపంచం మొత్తం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అదే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగనన్న సంక్షేమ పథకాల అమలు మాత్రం ఆగలేదు. 

బాబు పథకం ఒక్కటైనా ఉందా..?
        14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఫలానా పథకం తానే ప్రవేశపెట్టానని, అదో గొప్ప పథకం అని ఆ పార్టీ కార్యకర్తలనే చెప్పమనండి. అదే వైయస్సార్‌ గారి పేరు చెబితే రాష్ట్రంలో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం గుర్తుకు వస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, 108 అంబులెన్స్‌ సేవలు, ఉచిత విద్యుత్‌ గుర్తుకు వస్తుంది. అదే జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పేరు చెబితే రైతు భరోసా, అమ్మ ఒడి, వైయస్సార్‌ చేయుత, వైయస్సార్‌ ఆసరా ఇలా పథకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ ఆ పథకాలు అందిస్తున్నాం.

- మేకపాటి గౌతంరెడ్డిగారి ఆకస్మిక మరణంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించారు. 15ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన నాకు తన సొంత సోదరుడిలా ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు జగన్ గారు. నాకు ఈ స్థాయిని కల్పించిన జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1
    పరిశ్రమల శాఖ గురించి వస్తే... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలబడింది. ఎంఎస్‌ఎంఈల ద్వారా గడిచిన మూడేళ్లలో 1500 కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టాం. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలను పైకి తీసుకువచ్చి మేలు చేయాలనే కార్యక్రమం చేస్తున్నాం. అనేక పరిశ్రమలతో పాటు వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. పోర్టుల నిర్మాణం, 9 ఫిషింగ్‌ హార్బర్లు, ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు నిర్మాణం చేస్తున్నాం. విశాఖలో ఫార్మా సిటీని అభివృద్ది చేస్తున్నాం. అలాగే ఇన్ఫోసిస్‌ దిగ్గజం ఆంధ్రప్రదేశ్‌కు వస్తోంది.

నారా లోకేషా.. నందమూరి లోకేషా..!?
- తిరుపతిలో ఒక పరిశ్రమ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో నారా లోకేష్‌ ఒక ట్వీట్‌ చేశాడు. మేమే మాట్లాడాం, మేమే తీసుకువచ్చాం అని. మాకు పుట్టిన బిడ్డలకు మీరు పేరు పెడతారా అని అడిగాడు. అదే మేము అడుగుతున్నాం. అసలు నారా లోకేష్‌ ఎవరికి పుట్టాడు. చంద్రబాబు నాయుడికి పుట్టిన నువ్వు.. ఎన్టీఆర్‌ వారసుడినని చెప్పుకుంటావు. జన్మ, పుట్టక, వారసత్వం అంటే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది. రాజారెడ్డి మనవడిగా, రాజశేఖర్‌ రెడ్డిగారి వారసుడిగా రాష్ట్రంలోని కోట్లాదిమంది ప్రజలు మెచ్చిన నాయకుడిగా జగన్‌గారు ఉన్నారు. అదే నారా లోకేష్‌ తన తాత ఖర్ఝూర నాయుడి పేరు ఎప్పుడైనా చెప్పాడా? నారా లోకేష్‌ అనాలా? నందమూరి లోకేష్‌ అనాలా? తెలియని నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా? నీ తండ్రికి 75ఏళ్లు వచ్చాయి. అల్జీమర్స్‌ వచ్చింది. బుర్రలో సమాచారం లేదు కానీ, పైకి మాత్రం తనకు అంతా సమాచారం వస్తుందంటూ వేలికి రింగ్ చిప్‌ పెట్టుకున్నాడు.

- ఇకనైనా, చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే మంచిది.  బాబు రిటైర్మెంట్ ప్రకటిస్తే...  అందరి కంటే ఆనందించే వ్యక్తి నారా లోకేష్‌. 

- 2024 ఎన్నికల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం సమిష్టిగా పనిచేద్దామ‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. 

Back to Top