అమ్మ‌వారి ఆల‌య శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు రండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం అంద‌జేసిన ఆల‌య క‌మిటీ

తాడేప‌ల్లి: శ్రీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానం క‌మిటీ స‌భ్యులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గుంటూరులోని ఆర్‌.అగ్ర‌హారం శ్రీ‌క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి దేవస్థాన శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రికి ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేశారు. ఈ నెల 20 నుంచి 24 వరకు శత జయంతి మహోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర రావు (గిరి), ఆలయ కమిటీ చైర్మన్‌ దేవరశెట్టి సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top