వైయస్‌ఆర్‌ సీపీ పోరాట ఫలితం..

కేంద్ర హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా

తొమ్మిది అంశాలపై చర్చకు రావాలని ఏపీకి కేంద్రం పిలుపు

ఈనెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈనెల 17వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో 9 అంశాలపై చర్చించనున్నారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలోని 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. వీటిపై చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచన చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదట్నుంచి పోరాడుతున్నారు. పార్లమెంటులోనూ వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. 

తొమ్మిది ఎజెండాలు 

  • – ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన. 
  • – ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌ వినియోగ సమస్యల పరిష్కారం. 
  • – పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కరాం. 
  • – రెండు రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు 
  • – ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు ఖాతాల విభజన. 
  • – ఏపీ– తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ.
  • – ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు. 
  • – ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 
  • – రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు

Back to Top