వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలం అధ్యక్షులుగా శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి 

గుంటూరు:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికయ్యారు. ప్లీనరీ రెండోరోజు ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆమోదం, కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు.  ప్లీనరీ మొదటి రోజు(జులై 8, 2022న) నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున 22 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికయ్యారు.  ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులంతా జగన్ గారిని కలిసి అభినందనలతో ముంచెత్తారు. 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీగా..    
    అదేవిధంగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. మొదటిది, ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైయ‌స్ఆర్‌సీపీగా గుర్తించవచ్చు అన్న సవరణకు ఆమోదం  తెలిపారు. అలానే, ఆర్టికల్ 8, 9 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని చేసిన సవరణకు ఆమోదం తెలియజేశారు. 

10 తీర్మానాలకు ఆమోదం
    రెండు రోజులపాటు జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు.  తొలిరోజు ప్లీన‌రీ సమావేశంలో మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగం, న‌వ‌ర‌త్నాలు- డీబీటీ,  వైద్యారోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ.. తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు.

Back to Top