రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలి

 వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో పార్టీ సీనియర్ నాయకుడు, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు 

రాజ్యాంగ స్ఫూర్తిని వైయస్‌ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది

ప్రతి పేదవాడికి అండగా నిలవడమే వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం

సంపన్నుల ప్రయోజనాలు తీర్చటానికో, వారికి మేలు జరిగితే అదే అభివృద్ధి అని కొన్ని రాజకీయ పార్టీలున్నాయ్‌

సంక్షేమం అభివృద్ధి కోసం కాదని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పగలదా?

సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. వాటిని కార్యకర్తలు తిప్పి కొట్టాలి 

గడపగడపలో మహిళలు వైయస్‌ఆర్‌సీపీకే మళ్లీ ఓటేస్తామని చెబుతున్నారు

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు. విద్య, వైద్యం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి

పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు

రాజ్యాంగ బద్ధంగా వైయస్‌ఆర్‌సీపీ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి
     
దేశానికి ధాన్యాగారమైన మన రాష్ట్రం విద్యలో 22వ స్థానంలో ఎందుకు ఉంది 

శ్రీ జగన్‌ లాంటి నాయకుడు 50-75 ఏళ్ల క్రితమే వచ్చినట్లైతే విద్యలో మనం ఎప్పుడో ఒకటో స్థానంలో ఉండేవాళ్లం

పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి అందుబాటులోకి తెచ్చారు

రాష్ట్రంలో మానవ వనరుల్ని పెంపొందిస్తే అంతకుమించిన అభివృద్ధి లేదు

సమాజంలో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారని ముఖ్యం కాదు. ఏ ఒక్కరూ ఆకలితో లేరు అన్నది కావాలి. అలాంటిదే గొప్ప ప్రభుత్వం

గతంలో అనారోగ్యం పాలైతే చావే దిక్కు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఖరీదైన వైద్యం కూడా ఉచితం

కరోనాలో 9 నెలల ప్రతి ఇంటికీ సరుకులు తీసుకెళ్లి ఇచ్చిన ఘనత జగన్‌ గారిదే. ఏ ఇంటా ఆకలి కేకలు రాకుండా చేశారు

100 ఏళ్ల భవిష్యత్‌ను ఆలోచించే పరిపాలకుడు ఆ సమాజాన్ని చదివిస్తాడని సోక్రటీస్ ఏనాడో చెప్పారు. దాన్ని శ్రీ జగన్ చేసి చూపిస్తున్నారు

పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్న కుహనా రాజకీయ పార్టీలు, నాయకుల వల్ల అధికారం పోదు

రాజ్యాంగ నిబద్ధత, రాజకీయ భావజాలం వైయస్‌ఆర్‌సీపీకి ఉంది. ఇలాంటి భావజాలం రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేదు

 పార్టీ సీనియర్ నాయకుడు, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

 గుంటూరు: రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాల‌ని వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో పార్టీ సీనియర్ నాయకుడు, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం, రాజ్యాంగ నిబద్ధత అంశంపై సీనియర్‌ నాయకులు, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..  
ప్లీనరీ సమావేశానికి కొంత ప్రత్యేకత ఉంది. మన నాయకుడి ఆధ్వర్యాన మీ అందరి శ్రమతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావటం జరిగింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అందిస్తున్న పాలనపై ప్రజలకు అవగాహన ఉంది. ఐదేళ్లలో ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయి. ఇలాంటి సందర్భంలో ప్లీనరీని మళ్లీ జరుపుకుంటున్నాం. ఈ ప్లీనరీ ఎన్నికల నిబంధనల ప్రకారం జరుపుతున్నామని భావించటం లేదు. మన సిద్ధాంతాలు, లక్ష్యాలు.. చేయబోతున్న కార్యక్రమాల్లో మన పాత్రపై చర్చించటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మన నాయకుడు, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దిశా, నిర్దేశం అవగాహన చేసుకొని వైయస్‌ఆర్‌ సీపీ అభివృద్ధిలోనూ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లటంలోనూ మనకు మనం పునరంకితం అవుతూ చేసిన ప్రయత్నం ఇది.

  ప్లీనరీలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతానికి చేరుకున్నాక కార్యక్రమంలోని అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఈ ప్రభుత్వం ఏ పునాదుల మీద వచ్చింది. పార్టీ ఏ ఆశయాలను ప్రచారం చేసింది. మన నాయకుడు అమలు చేసిన కార్యక్రమాల ప్రయోజనాలు ఎవరికి వెళ్లాయి. ఎందుకు వెళ్లాయి. ఎందుకు అలా చేశాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. దీని వెనుక ఉన్న భావజాలం ఏంటి? మన పెద్దలు, రాజ్యాంగం చెప్పిన అంశాలపై అందరికీ అవగాహన రావాలి. అందుకే మన పార్టీ సిద్ధాంతం-రాజ్యాంగ నిబద్ధత అనే అంశంపై వివరిస్తున్నానని ధర్మా ప్రసాదరావు తెలిపారు.

రాజ్యాంగబద్దమైన పాలనను శ్రీ జగన్‌ గారు సాగిస్తున్నారు
 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించుకున్నాం. మనకు మనం సమర్పించుకున్న రాజ్యాంగం ఉపోద్ఘాతంలో (Preamble) We, The People of India, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC అని రాసుకున్నాం. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పరిపాలన రాజ్యాంగ బద్ధంగానే సాగాలి. కానీ, రాజ్యాంగం పట్ల గౌరవించని వ్యక్తులు పాలకులుగా వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని విస్మరించటం జరిగింది. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ, మన నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రాజ్యాంగానికి కట్టుబడే పరిపాలన సాగిస్తున్నారు.  

సంక్షేమంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయ్. దీన్ని పార్టీ కార్యకర్తలు గట్టిగా తిప్పికొట్టాలి
  మనం అమలు చేస్తున్న పథకాలను ఓట్ల కోసం చేస్తున్నారని రాజకీయ వ్యతిరేకులైన వారు (ప్రతిపక్షాలు) చెడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే వారికి గత్యంతరం లేదు. వారికి అధికారం వచ్చినప్పుడు ఇంతటి విశాలమైన భావజాలం కానీ, రాజ్యాంగబద్దమైన పరిపాలన చేయలేకపోయారు. వారు తాము చేసింది తప్పని గమనించారు. మనం చేస్తోంది.. మన పార్టీ, మన నాయకుడు చేస్తున్నది తప్పని చెప్పి ప్రజల్ని ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలి. సంక్షేమంను బూచిగా చూపిస్తున్నట్లు చూపిస్తున్నారు. ఎప్పుడూ సంక్షేమమేనా.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వరా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం అభివృద్ధికి కాదా అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? సంక్షేమం అభివృద్ధి కోసం కాదని ఏ రాజకీయ పార్టీ అయినా వేదిక మీదకు వచ్చి చెప్పగలదా? చెప్పలేరు. దొడ్డి మార్గాల ద్వారా సంక్షేమంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సంక్షేమమే సరైన అభివృద్ధి అని చెబుతున్నాను. రాజ్యాంగంలోనూ అదే చెప్పారు. 

కొన్ని పార్టీలు సంపన్నుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయ్‌
75 ఏళ్లుగా రాజ్యాంగ హక్కులు అందని వర్గాలకు వాటి ఫలాలను శ్రీ జగన్ అందిస్తున్నారు
 సంపన్నుల ప్రయోజనాలు తీర్చటానికో, భూములో, కొన్ని నిధులు, రోడ్లు, భవనాలు కడితే అది అభివృద్ధి అని చెప్పటానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ ఆ భవనాల కింద చితికి గడిచిన 75 ఏళ్లుగా నిస్సారంగా జీవిస్తూ ఉండటానికి గూడు లేక, కడుపు నిండా తినడానికి తిండిలేక, తన పిల్లల్ని  అందరి పిల్లల్లా చదివించటానికి అవకాశం లేక, నిస్పృహ, నిరుత్సాహంతో, అనారోగ్యంతో మురికి కాల్వల పక్కన బ్రతుకుతున్న వారి పరిస్థితులు అలాగే ఉంటే.. ఆ పక్కన ఉన్న భవనమో, రోడ్డో చూపించి అదే అభివృద్ధి అనే ప్రతిపక్ష పార్టీల్ని, కుహనా పార్టీల్ని గట్టిగా ఎదుర్కోవాలి. అభివృద్ధి అంటే అది కాదు. రాష్ట్రంలో ఉన్న సంపన్నుల సంఖ్య అభివృద్ధికి సూచిక కాదు. ఎవ్వరూ ఆకలితో లేకుండా అందరికీ సమానంగా అవకాశాలు వచ్చి.. అందరూ విద్యను అభ్యసించి.. నివాసయోగ్యమైన ఇల్లు కలిగి జీవించే పరిస్థితులు ఉంటే అదీ అభివృద్ధి. సంపదంతా కొద్ది మంది కొట్టుకుపోయి.. విద్యకు, ఆరోగ్యానికి దూరంగా పౌరులు ఉంటే అది అభివృద్ధి కాదు.  అలాంటి వాటికి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. 

అభివృద్ధి అంటే అందర్నీ చదువుకున్నవారు చేసి ఆ మానవవనరుల్ని ఉపయోగపడేలా చేసేవాడే సరైన నాయకుడు 
  మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి బియ్యం తీసుకెళ్లి అందిస్తున్నారు. కడుపు నిండా భోజనం అందించే భద్రతను శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. పిల్లలు చదివించటానికి అన్ని సౌకర్యాలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకువచ్చింది. తన పిల్లల్ని చదివించటానికి అన్ని సదుపాయాలు అందిస్తోంది. కాళ్లకు వేసుకునే బూటు నుంచి బెల్టు, దుస్తులు, పుస్తకాలతో పాటు తినటానికి మధ్యాహ్న భోజనంతో సహా అందిస్తోంది. విద్యా వసతి, విద్యా దీవెన, నాడు-నేడుతో రూపురేఖలు మారిపోయిన స్కూల్స్‌ అన్ని రకాల సదుపాయాలు హైయర్‌ ఎడ్యుకేషన్‌ వరకు ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమాలను ఓట్ల కోసం చేశారని ఎవరైనా భావిస్తే వారి అమాయకత్వానికి చింతిస్తున్నాం. 

ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్‌లో ఏం చెప్పారో.. దాన్ని శ్రీ జగన్‌ చేసి చూపిస్తున్నారు
ఓట్ల కోసం పథకాలు కాదు. భవిష్యత్‌ తరాల బాగు కోసమే
 రాష్ట్రంలో, దేశంలో సరైన సంపద, అభివృద్ధి అంటే అందర్నీ విద్యావంతుల్ని చేసి ఆ మానవ వనరుల్ని ఆ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేలా చేసేవాడే సరైన నాయకుడు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్‌ను ధర్మాన ప్రసాదరావు వివరించారు. States should undertake, at the national level, all necessary measures for the realization of the right to development and shall ensure, inter alia , equality of opportunity for all in their access to basic resources, education, health services, food, housing, employment and the fair distribution of income అని ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేశారు. అంటే.. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి హక్కుని అనుభవించటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. సహజ వనరుల్ని ఉపయోగించుకోవటంలో విద్య, ఆరోగ్యం, సేవలు వినియోగించుకోవటంలో, ఆహారం, గృహవసతి, ఉద్యోగం, ఆదాయం సంపాదించటంలో సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని అని ప్రపంచంలో అన్ని దేశాలు ఐక్యరాజ్యసమతిలో అంగీకరించి డిక్లరేషన్‌ విడుదల చేశాయి. ఆ డిక్లరేషన్ సారాంశమే ఇవాళ మన రాష్ట్రంలో మన నాయకుడు వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తోందని ధర్మాన ప్రసాద్ తెలిపారు. 

నేడు రాష్ట్రంలో ధనవంతుల బిడ్డలకు సమానంగా పేదల బిడ్డలు కూడా విద్యా హక్కు పొందుతున్నారు 
  ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం ఓట్ల కోసం చేసే పని కాదు. ఒక బిడ్డ ఒకటో తరగతి చదువుతుంటే అమ్మ ఒడి అని ఆ తల్లి ఖాతాలో డబ్బు వేయటంతో పాటు స్కూల్‌ను కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేయటం వారి భవిష్యత్‌ కోసమే. అంతేకాదు ఇంట్లో మధ్యాహ్న భోజనం పెట్టలేకపోతే స్కూల్‌లోనే మంచి భోజనాన్ని పెట్టడంతో పాటు మెనూలో ఏం పెట్టాలో కూడా సీఎం శ్రీ జగన్‌ గారే అత్యంత శ్రద్ధతో ఎంపిక చేశారు. దీనిబట్టి ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? నాడు-నేడు పథకం సారం కూడా ఇదే. రాష్ట్రంలో పేదవాడు, 75 ఏళ్లుగా విద్యకు దూరమైన పేదల బిడ్డలు నేడు ధనవంతుల బిడ్డలకు సమానంగా విద్యా హక్కు పొందుతున్నారు. 

గతంలో అనారోగ్యం పాలైతే చావే దిక్కు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఖరీదైన వైద్యం కూడా ఉచితం
 ఆరోగ్యం విషయానికి వస్తే గతంలో పేదవాడు ఎవరైనా అనారోగ్యంపాలైతే వైద్యం చేయించుకోలేమని అనుకునేవారు. మన బ్రతుకులు ఇలాగే ముగిసిపోతాయని ఎప్పుడు చనిపోతారో అని చింతించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో లేదు. నేడు పేదవాడు ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్‌  చేయించుకొని ఇంటికి వస్తున్నారు. ఇది పాలనలో వచ్చిన మార్పు కాదా? ఇదీ రాజకీయ సిద్ధాంతం. గడిచిన 75 ఏళ్లుగా బీదలకు అన్యాయం జరిగింది. రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన వాటా ఆనాడు మనం ఇవ్వలేకపోయాం. నేడు అలాంటి పరిస్థితి లేదు. ఐదేళ్లు వారికి మంచి ఆత్మవిశ్వాసం కలిగిద్దాం. రాజ్యాంగంలోని హక్కులన్నీ అనుభవిస్తే మా పరిస్థితులు కూడా మెరుగుపడతాయనే ఆత్మవిశ్వాసం కలిగిద్దామనే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారి ఆలోచనకు తోడుగా నిలబడదాం. దీన్ని రాష్ట్రంలోని కోటీశ్వరులు ఓర్చలేరా? వాస్తవం చెబుతున్నాం. గడపగడపకు వెళ్లినప్పుడు బీదల మొహాల్లో సంతోషం కనిపిస్తోంది. మహిళలంతా వైయస్‌ఆర్‌సీపీకే ఓట్లు వేస్తామని చెబుతున్నారు.

మహిళల బలోపేతం కోసం జగనన్న ప్రభుత్వం ఎంతో చేసింది. ఏం చేసినా మహిళల పేరుతోనే.. వారి ఖాతాలోనే
  గడిచిన 75 ఏళ్లుగా దేశంలో మహిళలు కొంత అణచివేయబడ్డారు. కొన్ని ప్రభుత్వాలు మహిళల్ని పైకి తీసుకురావటానికి ప్రయత్నం చేశాయి. కానీ, ఈనాడు మన ప్రభుత్వం మూడేళ్లలో ధీటుగా కుటుంబాన్ని ముందుకు నడిపించగలిగిన యుక్తి, శక్తి, త్యాగం మహిళలకు ఉన్నాయని వారిని బలపరిచే ప్రయత్నం చేసింది. దీనికోసం.. ఇల్లు, భూమి, రుణం, ఏ పథకం ఇచ్చిన వారి ఖాతాలో వేసి ఇల్లాలిని బలపరిచే పనిని ప్రభుత్వం చేసింది. ఇది మన భావజాలంలో భాగమే. శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉంటే.. గౌరవానికి ఏ లోపం ఉండదని, నిర్భయంగా జీవించవచ్చని రాష్ట్రంలోని మహిళలంతా భావిస్తున్నారు. శ్రీ జగన్‌ గారి ప్రభుత్వం ఉంటే.. కుటుంబాలను పోషించటంలో మేం ఎవరి వద్దా తలవంచాల్సిన పని లేదు. మా పిల్లల్ని చదివించటంలో మేం ఎవరి వద్దా దేహి అనాల్సిన అవసరం లేదు. మా కుటుంబ పెద్దల ఆరోగ్యం రక్షించటంలో ఈ ప్రభుత్వం ఉంటే చాలని మహిళా లోకమంతా వచ్చింది. ఇది మన ఐడియాలజీలో భాగం. రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో, ఐక్యరాజ్యసమితి ఏమని తీర్మానం చేశారో.. ఆ అభివృద్ధిని శ్రీ జగన్‌ గారి నేతృత్వంలో ప్రభుత్వం చేతల్లో చేసి చూపించింది.

శ్రీ జగన్‌ లాంటి నాయకుడు 50-75 ఏళ్ల క్రితమే వచ్చినట్లైతే విద్యలో మనం ఎప్పుడో ఒకటో స్థానంలో ఉండేవాళ్లం
 75 ఏళ్లుగా 30% ప్రజలు చదువుకు దూరంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం రాకముందు విద్యలో 22వ స్థానంలో రాష్ట్రం ఉంది. కేరళ తర్వాత రెండో స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌ 22వ స్థానంలో ఉంది. దేశానికి ధాన్యాగారంగా ఉన్న రాష్ట్రం విద్యలో 22వ స్థానంలో ఎందుకు ఉంది. ఇలాంటి నాయకుడు (సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి) 50-75 ఏళ్ల క్రితం ఉన్నట్లైతే రాష్ట్రంలో బీదల పరిస్థితి ఇలా ఉండేదా? ఒక ఆలోచనా ధోరణి రాష్ట్రాన్ని మార్చగలదు. రాజ్యాంగబద్ధంగా చేసిన పరిపాలన రాష్ట్రాన్ని మార్చగలదు. కుటిలంతో, అధికారం అనేది కొద్ది మందికి, బంధువులకు తన శ్రేయోభిలాషులకు పంచిపెట్టాలనుకునే ప్రభుత్వం ఇది కాదిది. అలా అనుకునేవారికి ఈ పార్టీలో నిరుత్సాహం కలుగుతుంది. ఇది అందరి ప్రజల బాగోగుల కోసం, జీవన ప్రమాణాలు పెంచటం కోసం చేస్తున్న పని. మూడేళ్ల క్రితం ఉన్న ప్రభుత్వం చేసిన అక్రమాలు మనం చూశాం. పెద్ద పెద్ద నిర్ణయాలు కొద్ది మంది ప్రయోజనాల కోసం ప్రజల్ని ఎలా మోసగించారో చూశాం. ఈనాడున్న ప్రభుత్వం మంచి నిర్ణయాల ద్వారా సామాన్యుడు కూడా బాగుపడగలను అనే తృప్తిని ఇస్తోంది. 

సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల ఏడుపుతో అధికారం పోతుందా? పేదవాడికి మేలు జరిగితే దుష్ప్రచారం ఏంటి?
  ఇవాళ దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి జన్మదినం. ఆయనకు నివాళి అర్పిస్తూ ఏ పునాదుల మీదైతే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేశారో దానికి మరో మూడు, నాలుగు రెట్లు ముందుకు నడిచి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిపై ప్రతిపక్షలు ఎన్నో విమర్శలు చేశాయి. ఇలా ఎన్నిరోజులు నడుపుతారని.. సంవత్సరంలో అయిపోతుందన్నారు. తర్వాత రెండో సంవత్సరం అన్నారు. మూడో సంవత్సరం వచ్చింది. అయిపోతుందన్నారు. నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం. ఐదో సంవత్సరంలో అడుగుపెడతాం. రెండో టర్మ్‌లో ఎన్నిక అవుతాం. మూడో టర్మ్‌ కూడా ఎన్నిక అవుతాం. రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వాలి కానీ ఇలాంటి కుహానా రాజకీయ నాయకులు వల్ల ఏం కాదు. బీద ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్న ఇలాంటి రాజకీయ పార్టీల వల్ల అధికారం పోతుందా? పోదు. ఇప్పుడే నాయకులు చెప్పారు. ఏ పునాదుల మీద ఈ పార్టీ ఉందో చెప్పారు. దాన్ని మనం విస్తృతంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. 

రెండేళ్ల కరోనా సమయంలోనూ 9 నెలలు ఇంటింటికీ సరుకులు పంపిణీ
  ఒకటో తరగతి పిల్లవాడికి ఇన్ని సదుపాయాలు కల్పిస్తే రేపు ఓటే వేస్తారని కాదు. అధికారం వచ్చిన మరుసటి రోజే ఈ కార్యక్రమాలు ప్రారంభించాం కానీ ఎన్నికల ముందు రోజు చంద్రబాబులా డబ్బులు వేసే పద్ధతి కాదు ఇది. ఇవన్నీ కార్యకర్తలు, నాయకులు ప్రతి కుటుంబంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దీనివెనుక ఉన్న భావజాలం, విస్తృతమైన ఆలోచనా ధోరణిని వివరించాలి. రాష్ట్రంలో మానవ వనరుల్ని పెంపొందిస్తే అంతకు మించిన అభివృద్ధి ఇంకొకటి లేదు. బీదలకు సదుపాయాలు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి భాగస్వామ్యం చేస్తున్నాం. దీనిపై సంపన్నులు ఓపిక పట్టకపోతే ఎలా అని నచ్చజెప్పాలి. సమాజంలో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఏ ఒక్కరూ ఆకలితో లేరు. ఒక్క కుటుంబం కూడా ఇబ్బందులు పడటం లేదని చెప్పేదే గొప్ప ప్రభుత్వం. రెండేళ్లు కరోనా దెబ్బకొడితే.. 9 నెలలు వరుసగా ఇంటికి సరుకులు తీసుకువెళ్లి ఇచ్చారు. బయటకుపోతే ప్రాణాలు పోతాయని భయం. అయినా ఏపీలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయంతో కుటుంబంలో ఎవ్వరూ కన్నీరు కార్చకుండా ఆకలి తీర్చిన ప్రభుత్వం మనది. ఇది ఇంటింటా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి కార్యకర్తలు, నాయకులు చెప్పకపోతే వారికి ఆ ప్యాకెట్ ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా తెలుస్తుంది. దాని వెనకున్న నాయకత్వం ఎవరిదో ఎలా తెలుస్తుంది. 

వందేళ్ల భవిష్యత్‌ ఆలోచించేవారు సమాజంలో అందర్నీ విద్యావంతులు చేయాలి-సోక్రటీస్‌
ఎంతో ఉన్నతమైన భావజాలంతో శ్రీ జగన్‌ గారు విద్యను అన్ని వర్గాల వారికీ అందేలా చేస్తున్నారు
  ప్రతి విషయం వెనుక ఎంతో ఉన్నతమైన భావజాలం వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. దేశంలో, ప్రపంచంలో అనేకమంది రాజకీయ సిద్ధాంతాలు రూపొందించినవారు చెప్పారు. ఒక సంవత్సరం ముందు ఆలోచిస్తే మంచి పంటలు పండించాలి. పదేళ్లు ముందు ఆలోచిస్తే పరిశ్రమలు పెట్టాలి. వందేళ్ల గురించి ఆలోచిస్తే అందర్నీ చదివించే పని చేయాలని గ్రీస్‌ దేశానికి చెందిన సోక్రటీస్ చెప్పారు. అదే పని రాష్ట్రంలో జరుగుతోంది. దీనివెనుక భావజాలం, రాజ్యాంగ నిబద్ధత ఉంది. ఇంత పెద్ద ఐడియాలజీ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ లేదు. నాయకుడు సీఎం శ్రీ జగన్‌ గారి భావజాలం పేదల హృదయాలను తాకింది. 75 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా జీవించే పరిస్థితి వచ్చింది. ఇది విశాలమైన భావజాలంతో ఒక రాజకీయ సిద్ధాంతంతో  రాజ్యాంగపరంగా పరిపాలన జరిగింది. రాజకీయ పార్టీ కార్యకర్త అంటే స్వచ్ఛంద కార్యకర్త. కార్యకర్త అనేవాడు సమాజం కోసం కరిగిపోతాడు. అలా సమాజం కోసం కరిగిపోవటానికి లక్షలాది, కోట్లాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిగా ఉన్నాను. తాత్కాలికమైన ప్రయోజనం రాలేదని, రాలేదనో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రాన్ని నిర్మించటంలో మన నాయకుడు చేస్తున్న ప్రయత్నానికి మనం కూడా ఒక సమిధిగా ప్రయత్నం చేద్దామని ధర్మాన తెలిపారు.  

చివరగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకూ దిశ నిర్దేశం చేస్తున్న పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, వేదిక మీద పార్టీ సహచరులు,  సోదరులకు ధర్మాన ప్రసాదరావు ధన్యవాదాలు తెలిపి ప్రసంగాన్ని ముగించారు.

Back to Top