అట్ట‌హాసంగా సీతంరాజు సుధాక‌ర్ నామినేష‌న్ దాఖ‌లు

విశాఖ‌: ఉత్తరాంధ్ర  పట్టభద్రుల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సీతంరాజు సుధాకర్ నామినేషన్ కార్యక్రమం అట్ట‌హాసంగా జ‌రిగింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వై .వి .సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో విశాఖ న‌గ‌రంలో ర్యాలీ నిర్వ‌హించి అనంత‌రం నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. భారీ మెజారిటే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్నామ‌న్నారు.  పట్టభద్రులు టీడీపీ, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని కోరారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని చెప్పారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top