‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి మంచి స్పందన

వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాగుతోందని చెప్పారు. అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రైతుల్లో అనుమానాలు రేకెత్తించేలా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డిస్కమ్‌లకు బాధ్యతలు పెంచడానికే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వానికి తెలుసు, పొందుతున్న రైతుకు తెలుసని చంద్రబాబు చెప్పేవన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ధరలన్నీ వైయస్‌ జగన్‌ పెంచుతున్నారని విష ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు అన్నారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాపై బండలు వేస్తున్నారని తెలిపారు. గడప గడపకు వెళ్లి మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ..ప్రతిపక్షం కుట్రలను తిప్పికొడుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 
 

Back to Top