తాడేపల్లి: వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ వ్యవస్థపై చంద్రబాబు తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారన్నారు. వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించింది చంద్రబాబే అని నొక్కి చెప్పారు. ఎల్లో బ్యాచ్ చర్యలతో పెన్షన్ల కోసం ఇవాళ వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనను కలసిన మీడియాతో వైయస్సార్ సిపి రాష్ర్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సచివాలయ వ్యవస్ద ఉపయోగం నేడు చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు తెలిసివచ్చింది. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్ధ ఉద్యోగులతో పెన్సన్ ల పంపిణి చేయచ్చని నేడు వారే చెబుతున్నారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని గత నాలుగేళ్ళుగా విమర్శలు గుప్పించిన వాళ్ళే 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో పెన్సన్ లు పంచవచ్చని అంటున్నారని సజ్జల మండిపడ్డారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాలంటీర్ల ద్వారాపెన్సన్ పంపిణి జరగకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఆ వ్యవస్ధ ద్వారా సంక్షేమ పధకాలు ప్రతి గడపకు అందించారు.అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరిత్యాలప్పుడుగాని,కోవిడ్ లాంటి విపత్కర పరిస్దితులలోగాని నేరుగా ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఒక లింక్ ఫామ్ చేశారు.ఉన్నతమైనదేకాక, శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే వ్యవస్ద అది. దానిని నీచమైనగా చూపుతూ వైయస్సార్ సిపి కి మేలు చేసేదిగా ఆ వ్యవస్దను చూపుతూ వచ్చారు. వాలంటీర్లపై చంద్రబాబు కనుక ఫిర్యాదుచేస్తే ప్రజలు ఉమ్మేస్తారు...రాళ్ళేసి కొడతారని భావించి తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ తో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయించారన్నారు. పెన్సన్ ల పంపిణి నుంచి వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించిందే చంద్రబాబే అని అదే రీతిలో కోర్టులో వేయించారని వివరించారు.అసలు సిటిజన్స్ ఫర్ డెమక్రసీ అని సంస్దను పెట్టించిందే దీనికోసం అని ఆరోపించారు. వాలంటీర్లు అనే వారి బాధ్యత పెన్సన్ ల పంపిణి.ఇకపై ఆర్టిసి,రెవిన్యూ ఉద్యోగులు,మున్సిపల్ ఉద్యోగాలు ఏ పనిచేయకూడదు. వీరి ఆలోచన అలానే ఉంది. ఏదైనా పధకాల అందించినా ....ఎల్లోమీడియా బ్యాచ్ చర్యలతో పెన్షన్ల కోసం ఈరోజు వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు.ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. ప్రజలలో చంద్రబాబుపై తిరుగుబాటు వస్తోంది. ప్రజలు శాపాలు పెడుతున్నారు. తిరిగి చంద్రబాబు వాలంటీర్ల ద్వారా మేం వస్తే 4 వేలు ఇస్తామని చెబుతున్నారు.ఓ వైపు వాలంటీర్లను తిడుతూనే...వాళ్ళు వద్దని అంటూనే వారిని కొనసాగిస్తామని చెప్పడం దుర్మార్గం.సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిగా గుర్తింపు పొందిన చంద్రబాబు అవసాన దశలో ఉన్న టిడిపి అద్యక్షుడుగా ఉండటం మన దౌర్భాగ్యం అన్నారు. జగన్ గారు వాలంటీర్ల వ్యవస్దను ప్రజలలోకి తీసుకువెళ్లారు.దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి.ఇతర రాష్ర్టాల వారు సైతం దానిని మెచ్చుకున్నారు.అలాంటి స్దితిలో చంద్ర బాబు కడుపు మంటతో వాలంటీర్లపై ఈసికి ఫిర్యాదు చేయించి పెన్సన్ ల పంపిణిని వాలంటీర్ల ద్వారా చేయద్దని అడ్డుకున్నారని తెలియచేశారు.రెండు పత్రికలు,మూడు టివి ఛానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు విషం చిమ్ముతున్నారు.ఒకడేమో పండుటాకులపై పగ అని...శవరాజకీయాలు చేస్తున్నామని మరొక పత్రికలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు.వాటినే తీసుకుని చంద్రబాబు జనం రాని బహిరంగసభలలో ఆ మాటే మాట్లాడుతుంటారన్నారు. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది. ఆ విషయం చంద్రబాబుకి తెలుసుకాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు. ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు. మీరు గమనిస్తే ఎన్నికల కమీషన్ కు వెళ్లే తప్పుడు ఆరోపణలన్నీ ఈనాడు,ఆంధ్రజ్యోతిలలో మొదట ప్రచురిస్తారు.ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లి పదే పదే ఈసి వద్దకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్ధను ఎవ్వరూ ఏమీ చేయలేరు.అది అవసరం దాని వల్ల ఉపయోగం ఉంది. నాలుగేళ్ళలోఅది ఎస్టాబ్లిష్ అయింది.తిరిగి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశాక మరింత మెరుగ్గా వాలంటీర్ల సర్వీసులు వాడుకునేలా చేస్తారు. ఆ భరోసా వాలంటీర్లందరికి ఉందన్నారు. వాలంటీర్ అనే పేరులోనే సర్వీసు అనేది స్పూరిస్తుంది.వారికి ఇచ్చేది పారితోషకం శాలరీ కాదు అని వివరించారు. బాధ్యతలు స్వఛ్చందగా చేసేవేనని అన్నారు. సమాజంలో బాగా బతికేందుకు సామాజిక స్పృహ పెంచుకునేందుకు వాలంటీర్ గా పనిచేయడం అనేది దోహద పడుతుంది అన్నారు.నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని అన్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ అధికారదాహం ఉంటుందన్నారు.వెన్నుపోటు ద్వారా ఓ సారి,పొత్తుల ద్వారా అధికారంలోకి వచ్చారు.వాలంటీర్ల వ్యవస్ద లాంటి ఆలోచనలు చంద్రబాబుకు ఎప్పుడూ రావు. కలలో కూడా ఆలోచనలు రావు.అంతా డొల్లమాటలు.కేవలం అధికారం చేజిక్కించుకోవడం,దోచుకోవడం,అరాచకాలు ఇవే ఆయన ఆలోచనలు. ఎప్పుడూ కూడా ఎన్నికలు వచ్చేసరికి కొత్తపొత్తులు ద్వారా ప్రయత్నాలు అధికారం కోసం అర్రులు చాచడం చేస్తుంటాడని విమర్శించారు.జగన్ గారి పాలన రుచిచూశాక చంద్రబాబులాంటి దుర్మార్గపాలన ప్రజలు కోరుకోరన్నారు. ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే టిడిపి,బిజేపి ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.... పురందేశ్వరి,చంద్రబాబులు వదినా,మరుదులుగా ముందునుంచే లోపాయికారిగా సహకరించుకుంటూ కూడబలుక్కుని వైయస్సార్ సిపి ప్రభుత్వంపై ఈసికి ఫిర్యాదుల చేస్తూనే ఉన్నారన్నారు. బిజేపిలో ఉన్న టిడిపి నేతల ద్వారానూ..పురందేశ్వరి ద్వారా ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు బిజేపి,టిడిపి,జనసేన కూటమి అయ్యాక ఫిర్యాదులు చేయడం సరేసరి అన్నారు. అధికారులను డీమోరలైజ్ చేసేందుకు పురందేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు నేను ఓ పత్రికలో చూశాను.20 మంది ఐపిఎస్ లపై ఫిర్యాదు చేశారు. ఈ లెక్కన చూస్తే నరేంద్రమోది ప్రభుత్వంలో పనిచేసేవారందరూ బిజేపి తొత్తులై ఉండాలన్నారు. లేదా బిజేపి రూల్స్ స్టేట్స్ లో వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలి అని ప్రశ్నించారు.పురందేశ్వరి కేంద్ర మంత్రిగాను,చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఎక్కడైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయడంలో తప్పులేదు.ఎన్నికల కమీషన్ పరిధిలోకి వ్యవస్దలు వెళ్లాక అది ప్రతిపక్షమైనా,అధికారపక్షమైనా సరే బాధలు ఉంటే చెప్పుకోవచ్చు. అన్నారు.అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.అధికారయంత్రాంగాన్ని ఢీమోరల్ చేయడానికి,ఆత్మస్దైర్యం దెబ్బతీయడానికి కక్షగట్టి ఫిర్యాదులు తప్పుడువి చేస్తున్నారు.అయోమయం సృష్టిస్తున్నారు.వారికి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ఇలాంటివి చేస్తున్నారు.ఈసిపై వత్తిడి తెస్తున్నారు.వారు కూడా లొంగిపోతున్నారు.నిన్న అధికారులను బదిలీ చేశారు.ఏ రీజన్ కిందనో చెప్పిఉండాల్సింది. చిలకలూరిపేట ప్రధానిసభ అని ఓ రీజన్ చెప్పారు. ప్రధాని సెక్యూటిరికి ఎస్పిజి ప్రత్యేకంగా ఉంటుంది.ప్రధాని వచ్చారంటే మొత్తం వారి ఆధీనంలో ఉంటుంది. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. ఇధి రిపోర్టర్లకు,మీడియాకు కూడా తెలుసు అన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు. మేం ప్రజలనే నమ్ముకున్నాం. మీకు మా పరిపాలన వల్ల మంచి జరుగుతుందని భావిస్తేనే ఓట్లు వేయండని అడుగుతున్నారు. ఈసి కంట్రోల్ లో ఉండే వ్యవస్ధల నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికలలో విజయం మరింత శోభను ఇస్తుందని అన్నారు. రేపు మేం గెలిచాక అధికారుల వల్లే గెలిచారు అని అనడానికి వాళ్లకు ఇప్పుడు లేకుండా పోయింది అని సజ్జల పేర్కొన్నారు. ప్రజలకు క్లారిటి ఇస్తున్నాం. వైయస్సార్ సిపి పూర్తి పాజిటివ్ ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్నాం.మేం ఇప్పటివరకు ఏంచేశాం.తిరిగి మేం గెలిస్తే మీకు మరింత మెరుగ్గా ఏమి చేస్తామో భరోసా ఇస్తున్నాం. టిడిపి,చంద్రబాబులు చూస్తే బాబాయ్ గొడ్డలి అంటారు.మరొకరు చెళ్ళెళ్లు ఎందుకు లేరంటారు. లోకేష్ ఏమో జడ్ ప్లస్ భధ్రత లేకపోతే నా ప్రాణాలకు హాని మరొకరు అంటారు. పవన్ కల్యాణ్ చూస్తే హైద్రాబాద్ నుంచి అతిధిగా వచ్చి సాయంత్రానికి వెళ్తుంటాడు.పైగా పిఠాపురం లో తాను తిరిగుదామంటే బ్లేడ్ బ్యాచ్ లు తనను కోస్తున్నాయని అంటాడు.కత్తులతో పొడుస్తారంటాడు. పవన కల్యాణ్ తాను రాజకీయపార్టీ నడుపుతున్న వ్యక్తిగా ఏం చేస్తుంటాడో ఆయనకే క్లారిటీ లేదు. రాష్ర్టంలో క్లారిటీతో కనబడుతున్న పార్టీ వైయస్సార్ సిపి మాత్రమే అన్నారు.ఎన్నికలకు ముందే టిడిపి,జనసేన,బిజేపిల కూటమి చెప్పడానికి ఏమీ లేదన్నారు.ఇప్పటికే దివాళా తీశారు.ఆ కూటమి కంప్లీట్ గా మునిగిపోయిందనేది వారు చేస్తున్న చేష్టల వల్ల తేలిపోతోందన్నారు. వివేకానంద హత్యవిషయంలో షర్మిల,సునీతలు చేస్తున్న విమర్శలను తప్పుడు విమర్శలుగా సజ్జల కొట్టిపడేశారు.జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఆఖరుగా షర్మిల,సునీతలను ముందుపెట్టి ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు.ఐదేళ్ళు ఏమీ మాట్లాడని షర్మిల ఈరోజు వచ్చి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.ఏమీ చేయలేని నిస్సహాయస్దితిలో అమసర్దుడి దుర్జనత్వం అంటారు.అదే స్దితికి చంద్రబాబు వచ్చాడన్నారు.ఉదయం లేచిన దగ్గర్నుంచి వారు చేసే విమర్శలకు సమాదానాలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదన్నారు.ఎందుకంటే వాళ్ళు కోర్టుపరిధిలో ఉన్న అంశాలు గురించి కూడా మాట్లాడుతున్నారన్నారు.దురదృష్టవశాత్తు ఐదేళ్ళ క్రితం జరిగిన హత్య గురించి ఈరోజు మాట్లాడటం చూస్తే జగన్ గారిని దెబ్బతీయాలనే దురుధ్దేశ్యం కనిపిస్తుందన్నారు.చంద్రబాబు ఆడమన్నట్లుగా వారిద్దరు ఆడుతున్నారని తెలియచేశారు.