కావాలనే చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంయమనంతో ఉన్నారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: కావాలనే చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎల్లో బ్యాచ్‌ రెచ్చిపోయి కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా దాడులు చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం, పోలీసుల వాహనాలకు కూడా నిప్పటించారు. మరోవైపు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. టీడీపీ శ్రేణులు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ పరామర్శించారు.

 టీడీపీ నేతల దౌర్జన్యకాండపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంయమనంతో ఉన్నారు. కావాలనే చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రస​ంగాలు చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలి. అంగళుల్లో పథకం ప్రకారమే టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తానే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే పిచ్చితో చంద్రబాబు ఉన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. 

Back to Top