చంద్రబాబే కాదు, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

బహుశా చంద్రబాబు ప్రవర్తనకు.. ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమో

చంద్ర‌బాబుకు ప్రజలు ఎందుకు  ఓట్లు వేయాలి?

హైవే పై లెక్కలేనితనంతో పవన్ వ్యవహరించారు

తాడేప‌ల్లి: ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్ర‌బాబే కాదు, ప్ర‌జ‌లు కూడా అనుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. 2019లోనే ఆయన్ను, టీడీపీని సాగనంపారని తెలిపారు. దింపుడు కళ్లెం ఆశలా ప్రజల్ని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదని తేల్చి చెప్పారు. తనకోసం ప్రజలు ఉన్నారని చంద్రబాబు భ్రమ పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటికి పదిసార్లు తన భార్యను ప్రజల్లో చెప్పి, చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని చెప్పారు. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు.. ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు. లేనివన్నీ చంద్రబాబే ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు.
 
ప్రజల్ని విజ్ఞప్తి చేయడానికి బదులు.. తానే ముఖ్యమంత్రిగా వస్తానని చంద్రబాబు అనడమేంటి? అని సజ్జల రామకృష్ణా ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే‌.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు.  

పవన్ కళ్యాణ్‌పై కూడా సజ్జల ధ్వజమెత్తారు. హైవే పై లెక్కలేనితనంతో పవన్ వ్యవహరించాడని విమర్శించారు. అలాగే.. బీజేపీ నుంచి ఎవరు సాఫ్ట్ వైఖరి ఆశిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో ఉద్యోగులంతా సమానమే అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకోవాలనే ధోరణిని కనబరిచాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దని సీఎం స్పష్టంగా చెప్పారు.

పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని తెలిపారు. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకునే ఉద్దేశం మాకు లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

Back to Top