ఎన్ 440కే స్ట్రేయిన్ చంద్ర‌బాబు సృష్టించిన అభూత క‌ల్ప‌న‌

వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

 రాష్ట్రంలో కొత్త వేరియంట్ అంటూ బాబు విష ప్ర‌చారం 

చంద్ర‌బాబు అస‌త్య ప్ర‌చారాల‌తో ఇతర రాష్ట్రాలు ప్ర‌యాణాల‌పై నిర్బంధం విధించాయి

 సీసీఎంబీ, సెంట్రల్ బయో టెక్నాలజీలు.. ఈ స్ట్రెయిన్‌తో ప్రమాదం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయి

 రాష్ట్రం మొత్తం చంద్రబాబుపై కేసులు పెట్టాలి

 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ఎన్ 440 కే స్ట్రేయిన్ అనేది చంద్ర‌బాబు సృష్టించిన అభూత క‌ల్ప‌న అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. కోవిడ్‌ కట్టడిపై చంద్రబాబు  విషప్రచారం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కోవిడ్ మీద చంద్ర‌బాబు విష ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని మండిప‌డ్డారు. మ‌న దుర‌దృష్టం ఏంటంటే చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ప‌ని చేయ‌డం, వృద్ధ నేత కావ‌డంతో ఇత‌ర రాష్ట్రాల నేత‌లు ఆయ‌న మాటలు న‌మ్ముతున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు విష ప్ర‌చారంతో సంక్షేమ ప్ర‌భుత్వంపై ప్ర‌భావం ప‌డుతోంద‌న్నారు.

మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే, వారిని దండించాల్సిన రాజకీయ అనుభవం, వయసు, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి పదవిలో ఉన్న చంద్రబాబే ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్డడితే.. అతన్ని ఏం చేయాలో, ఎలా దండించాలో, ఏ శిక్ష విధించాలో.. ఈ రాష్ట్రంలోని పౌర సమాజం, మేధావులు, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలి, ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అని ఒకవైపు ప్రజలు ఆందోళనలు చెందుతున్న వేళ.. ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా, సమాజం పట్ల కనీసం బాధ్యత కలిగిన పౌరుడిగా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోగా, కేవలం జగన్ మోహన్ రెడ్డిగారిపై ఉన్న రాజకీయ కక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నిందలు మోపుతూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. లేని వైరస్ ను ఉన్నట్టు సృష్టించి, అది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులోనే పుట్టిందని, ఆ వైరస్ చాలా ప్రమాదకరమని తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజులపాటు క్వారంటైన్ కు పంపాలని ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. ఇందుకు చంద్రబాబే కారణం అన్నారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఏమైనా ఉంటుందా..? అని చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు.

ఒక మనిషిగా కాకుండా, మనిషి రూపంలో ఉన్న దెయ్యంలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఇటువంటి దుష్ట నాయకుడ్ని మోస్తున్నందుకు సిగ్గు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు రాష్ట్ర పరిధిలో లేని వ్యాక్సినేషన్ సరఫరా, నియంత్రణ, మోనిటరింగ్ పై, రోజూ అబద్ధాలు చెబుతూ,  మీరెందుకు చేయరు అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తద్వారా ప్రజలను రెచ్చగొట్టి, వారిని మరింత అభద్రతాభావానికి, భయాందోళనళకు గురి చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు అన్నా, ప్రభుత్వం అన్నా చంద్రబాబుకు లెక్కలేకుండా పోయిందని చెబుతూ.. పదే పదే తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి చొప్పించి, వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దుష్ట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

 
 కరోనా వైరస్ కు సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా, రాజకీయ అంశంకాని సైన్స్ పరమైన అంశాలను కూడా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రజలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. గత కొద్దిరోజులుగా కోవిడ్ పై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సమాజంపై తీవ్రం నష్టం జరుగుతుంది. ఢిల్లీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. వివేకవంతులైన ప్రజలు, మేధావులు స్పందిస్తున్న తీరు కూడా ఇందుకు నిదర్శనం. 
చంద్రబాబు ప్రచారం ఎక్కడకు వెళ్ళిదంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తున్న ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్ లో పెట్టాలని ఆ రాష్ట్రాలు ఆదేశించే పరిస్థితికి వచ్చాయి. 

చంద్రబాబు మొదలు పెట్టిన ఎన్ 440 కె అనే వైరస్ కర్నూలులో పుట్టిందని, దానివల్ల తక్కువ సమయంలోనే ఆరోగ్యం క్షీణించి, ఆక్సీజన్ అందక  తొందరగా చనిపోతున్నారని ప్రచారం చేశాడు. చంద్రబాబు మాట్లాడిన రోజే భయపడ్డాం.. ఇది ఎక్కడకు దారితీస్తుందే అని. ఊహించినట్టే జరిగింది. చంద్రబాబుకు కనీస జ్ఞానం లేకపోయినా, ఆయన ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయడం, 40 ఏళ్ళ అనుభవం ఉంది, కేంద్రంలో చక్రం తిప్పానని ప్రచారం చేసుకోవడం వల్లే, ఆయన చెప్పింది నిజం అనుకునే పరిస్థితులు కొంతవరకూ ఉండవచ్చు. వాస్తవానికి అది మన సబ్జెక్టు కాదు. అటువంటి అంశాలను సైంటిస్టులు చూస్తున్నారు అని నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా.. అమెరికాలో ఆయనకు తెలిసిన వ్యక్తి ఎవరో చెప్పారని ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారు. 
చంద్రబాబు సైన్స్ చదవ లేదు.  వైరస్ అన్నది రాజకీయ అంశం కాదు. తన పరిధిలో లేని, అవగాహన లేని అంశంమీద దూకుడుగా ముందుకు వెళ్ళి చేస్తున్న విష ప్రచారం ఇది.  మన రాష్ట్రం ఖర్మ గాలి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడిగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. 

కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో కాదు. సెకండ్ వేవ్ అనేది పశ్చిమాది రాష్ట్రాల నుంచి వ్యాప్తి చెందిందని దేశం మొత్తం తెలుసు. అటువైపు నుంచి మనకు రావడం వల్లే ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఘోరమైన పరిస్థితులు చూశాం. దీనిని రాజకీయం చేసి, మాట్లాడుకునే సమయం కాదు గానీ,  మనకు తెలియని ఏరియా అయిన సైన్స్ గురించి చంద్రబాబు మేధావిలా మాట్లాడుతున్నాడు. ఏపీలో ఎన్ 440కె స్ట్రెయిన్ ప్రభావం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో ల్యాబ్ కల్చర్  చేసినప్పుడు అలా వచ్చింది, దానిని సీరియస్ గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. వాస్తవానికి ఈ అంశాలు వాటిల్లో తల పండిన వాళ్లు మాట్లాడుకోవాల్సిన, తేల్చాల్సిన విషయాలు, రాష్ట్రానికి ఎంతవరకు కావాలో అంత వరకు తీసుకుని రోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఫీల్డ్ మనది కాదు. చంద్రబాబు ఖాళీగా కూర్చున్నారు కాబట్టి స్టడీ చేస్తే మంచిదే.  ఒక పెద్ద మనిషిలా జాగ్రత్తలు చెబితే మంచిది. ఆఖరికి వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే.. ఆ స్ట్రెయిన్ కు ఏపీ స్ట్రెయిన్ అని పేరు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. 
 రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వైరస్ ను ఫేస్ చేసేందుకు అందరూ పోరాడుతున్న సమయంలో... వివేకవంతులైన వారెవరైనా సంయమనం పాటించాలి. ఎక్కడో చెట్టు కింద కూర్చుని మాట్లాడిన వాళ్ళలా దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు మాట్లాడటం ఏమిటి..? ఈ సంక్షోభ సమయంలో ప్రజలు నిబ్బంరంగా ఉండాలని ఏ సీనియర్ నాయకుడు అయినా మాట్లాడాలి, మాట్లాడతారు, కానీ  చంద్రబాబు నాయుడుది మిడి మిడి జ్ఞానం కూడా కాదు, పూర్తి అజ్ఞానం అని అర్థమవుతుంది. 

జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఏదో ఒకటి దొరికింది కదా.. అని ఏదో ఒక బండ తెచ్చి వేస్తున్నారు, దీనిని పైశాచిక ఆనందం అంటారు. దెయ్యాల గుంపులా తయారై, మనిషి రూపంలో ఉన్న దెయ్యంలా, ప్రభుత్వానికి సంబంధం లేని అంశమైనా, జగన్ గారిపైన, ప్రభుత్వంపైన ఒక బండ వేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. 
- గత పదేళ్ళుగా చంద్రబాబు కుయుక్తులు, టక్కు,టమార విద్యలన్నీ ఎదుర్కొనే సత్తా జగన్ గారికి, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు కుట్రల వల్ల మధ్యలో 5 కోట్ల మంది ప్రజలు, వారి ప్రాణాలు ఉన్నాయి. వారితో చెలగాటమా..?

ఆసుపత్రుల వ్యవస్థకు మించి వస్తున్న కోవిడ్ కేసులను ఎలా ఎదుర్కోవాలి, రోగులకు త్వరితగతిన ఎలా వైద్య సేవలు అందించాలనే అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రోజూ సమీక్షలు నిర్వహిస్తూ, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు భరోసాగా మాట్లాడాల్సిన ప్రతిపక్షనేత చంద్రబాబు, అది చేయకపోగా, తాను చేసిన పనికి మాలిన పని వల్ల, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఏపీ ప్రజలను క్వారంటైన్ లో పెట్టండని ఆదేశాలు ఇచ్చారు. 

ఏ రాష్ట్రం అయితే మిమ్మల్ని ఇన్నాళ్ళు మోసిందో, రాష్ట్రం మిమ్మల్ని భరిస్తే.. ఆయన చేస్తుంది ఏంటంటే, అనుభవంతో కూడిన మంచి సలహాలు ఇవ్వాల్సిందిపోయి, మరింత భయానక పరిస్థితి, అభద్రతా భావం కలిగించే విధంగా చంద్రబాబు లేనిదాన్ని సృష్టించి.. తెలుగు ప్రజలు అంటే అంటరానివారుగానో, రోగాన్ని తెచ్చే వారిగానో దుష్ప్రచారం చేశారు. దీనికి చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలి. 
 కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రబాబుపై నిన్ననే కేసు పెట్టారు. చంద్రబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలి. దేశ ద్రోహం కేసులుకూడా పెట్టాల్సిన పరిస్థితి. 
 చంద్రబాబు చేసిన దుష్ప్రచారం చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రజలను చంపాలనుకుంటున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
  హైదరాబాద్ లో కూర్చుని రోజూ జూమ్ టెక్నాలజీలో రివ్యూలు పేరుతో, నిరసనలు, పోరాటాలు అంటూ చంద్రబాబు చెత్త రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడే చెత్త మాటలను, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియాలో  పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు.

 చంద్రబాబు చేసే ప్రచారం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్  వచ్చే అవకాశం, కొంతమందైనా నమ్మే పరిస్థితి ఉంది. తనకుమాలిన దానిలోకి వెళ్ళి చంద్రబాబు ఎందుకు వేలు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నాడు..?  దీనిపై పౌర సమాజం ఎక్కడకు అక్కడ రియాక్ట్ కావాలి. అసలు బుద్ధి ఉందా.. ఏం తింటున్నారు, ఎందుకు భయాందోళనలకు గురి చేస్తున్నారని, టీడీపీని, చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలి. 

 నిజం గడపదాటే లోపల, అబద్ధం  వెయ్యి ఊర్లు తిరుగుతుందన్న సామెతగా... అందరికీ కళ్ళ ముందు కనిపించే వ్యాక్సిన్ల పై కూడా  చంద్రబాబు ఇష్టారీతిలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 
 ఏప్రిల్ 9వ తేదీ సీఎం జగన్ గారు వ్యాక్సిన్ల కోసం ప్రధానికి లేఖ రాశారు. టీకా ఉత్సవం కోసం 25 లక్షల వ్యాక్సిన్ డోస్ లు పంపండని రాశారు. కేంద్రం 6.4 లక్షలు వ్యాక్సిన్లు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సీఎం జగన్ గారు ప్రధానికి మరో లేఖ రాస్తూ.. 
కేంద్రం పంపిన వ్యాక్సిన్ లలో 6.28 లక్షలు ఏప్రిల్ 14న సింగిల్ డేలోనే  వేశాం అని వివరించారు. 45 ఏళ్ళ పై బడిన వారికి వ్యాక్సిన్ లు వేసేందుకు 60 లక్షల వ్యాక్సిన్ డోస్ లు  ఇవ్వాలని రాశారు. 
   ప్రధానికి రాసిన లేఖలో మన రాష్ట్రం కెపాసిటీ ఏమిటి.. మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెబుతూ, 6 లక్షల మందికి ఒక్కరోజే వ్యాక్సినేషన్ చేయగలం, ఇది దేశంలోనే రికార్డు అని చెప్పాం.
 జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. ఏర్పాటు చేసిన వ్యవస్థలు అంత సమర్థవంతంగా ఉన్నాయి. కేంద్రం వ్యాక్సిన్ సరఫరా చేస్తే.. గ్రామ సచివాలాయలు, వాలంటీర్లు, ప్రాథిమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా.. మిగిలిన రాష్ట్రాలకంటే ముందుగా వ్యాక్సిన్ లు వేయగలం అని వివరించాం. పరిపాలనను ప్రజల ఇంటి గడప వద్దకు తీసుకు వెళ్ళడంలో జగన్ గారు, తన విజన్ వల్ల సక్సెస్ అయ్యారు. 

  మరోవైపు వ్యాక్సిన్ ల సరఫరా మీద రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోలులేదని చెబుతున్నా.. ఎందుకు వేయలేదని చంద్రబాబు, టీడీపీ రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సీరం కంపెనీ యాజమాన్యంకు ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ 4.08 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాశారు. అలానే భారత్ బయోటెక్ యాజమాన్యానికి కూడా ఏప్రిల్ 24వ తేదీన 4 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని స్పష్టంగా ఆయా యాజమాన్యాలు తిరుగు లేఖలు రాశాయి. అంటే, వ్యాక్సిన్ల ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్, మోనిటరింగ్ అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. కేంద్రం అనుమతి లేకుండా వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి, వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉత్పత్తి చేయలేదు కదా.. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు అయితే, ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు కదా.. తక్షణం వ్యాక్సిన్లు ఇవ్వాలని చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాయాలి. 
 వ్యాక్సిన్ లు ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఇవ్వాలి...? ఆమాత్రం బుద్ధి, జ్ఞానం లేకపోతే రాజకీయాల్లో, ఒక పార్టీకి అధ్యక్షుడిగా కూడా చంద్రబాబు పనికిరారు. 
  ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. సీపీఎం లాంటి పార్టీ కూడా అక్కడక్కడా కోవిడ్ కేర్ సెంటర్లు నడిపిస్తుంది, అలాంటివి కచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాయి. 
  కానీ, చంద్రబాబు అలా చేయరు. మన పరిధిలో లేని అంశాలను తెరపైకి తెచ్చి,  దీనికి జగన్ గారు  బాధ్యుడు అంటారు. దీనిని ప్రతి ఒక్కరూ ఎండగట్టాలి.  బుద్ధి ఉందా అని మాట్లాడాలి.  తప్పుడు మాటలు మాట్లాడే చిన్న పిల్లవాడినైతే కొడితే వింటాడు. ఇంత అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలి..?

 తెలియని పిల్లలు, యువకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఖండించాలి, అటువంటిది చంద్రబాబే ఇలా ప్రచారం చేస్తున్నారు. దీని ప్రభావం కోర్టుల మీద కూడా పడుతుంది. 
 ఇటువంటి సంక్షోభ సమయంలో అన్నిరకాల శక్తులు ఒకవైపే ఉండి.. ప్రభుత్వ యంత్రాగానికి, వైద్య సిబ్బందికి అండగా అంతా నిలబడాల్సిన సమయం ఇది. 

  కేబినెట్ లో కోవిడ్ ను చివరి అంశంగా ఎలా చేరుస్తారని చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా.. అని, అది నిజమే అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కానీ అది నిజం కాదు. 
 లోతుగా చర్చించే అంశాలు ఏమైనా ఉంటే కేబినెట్ సమావేశాల్లో అవి చివరిగానే పెడతారు, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కావాలనే దుష్ర్పచారం. ఎందుకంటే, ఈ ప్రభుత్వంమీద, జగన్ మోహన్ రెడ్డిగారి మీద అక్కసు, కడుపు మంట, దుష్ట బుద్ధి, చిల్లర వ్యవహారం వల్లే ఇటువంటి నిందలు చంద్రబాబు మోపుతున్నాడు. 
  ఆక్సీజన్ రాత్రికి రాత్రి రాదు. ఆక్సీజన్ సరఫరాను కూడా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం పారిపోవడం లేదు. 
- వంకర ఆలోచనలతో కుట్రలు, కుయుక్తులు, కుట్రలు చేసే చంద్రబాబు లాంటి వాళ్ళకు విజ్ఞులైన ప్రజలు, మేధావులు, పౌర సమాజం బుద్ధి చెప్పాలి.

Back to Top