బడుగుల బలం బలగం జగనన్న 

ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం: మంత్రి విడదల రజని

అంబేద్కర్‌ కలలు సాకారం చేసిన సీఎం వైయ‌స్ జగన్‌: ఎంపీ మోపిదేవి వెంకటరమణ 

మంత్రులుగా ఎస్సీ, బీసీ, ఎస్టీలకు వెతికి వెతికి ఇచ్చిన జగనన్న: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 

పేదవాడి ఆకలిడొక్క తెలిసిన వ్యక్తి సీఎం జగన్‌: ఎంపీ నందిగం సురేష్ 

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగనన్నదే: ఎమ్మెల్యే శంకర్‌రావు 

జగనన్న మాట ఇస్తే తప్పడు.. మడమ తిప్పడు: నటుడు ఆలీ  

పెదకూరపాడు: సామాజిక సాధికార బస్సు యాత్ర పెదకూరపాడులో ప్రభంజనం సృష్టించింది. జనంతో అమరావతి పొలికేక పెట్టింది. జగనన్న సారథ్యంలో అట్టగుడుగువర్గాల అభ్యున్నతిని సాకారం చేసి జనం వద్దకు వచ్చిన జగనన్న సైన్యానికి  అడుగడుగునా జేజేలు లభించాయి. సామాజిక సాధికార బస్సు యాత్ర  పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని, ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, నంబూరు శంకరరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు ఆలీ తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. 

 మంత్రి విడదల రజని మాట్లాడుతూ..... 

– సామాజిక సాధికార యాత్రలో జనవర్షం కురుస్తోంది.
– మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటున్నాం. నరకాసురున్ని సంహరిస్తే దీపావళి చేసుకుంటున్నాం. 
– తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే, ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలి? ఆ ఉత్సవాలే ఈ సామాజిక సాధికారత. 
– జగనన్నది పేదల ప్రభుత్వం. బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం. 
– బడుగు, బలహీన వర్గాలు సామాజిక సాధికారత సాధించాలంటే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలహీనవర్గాలు ఎదిగినప్పుడే సాధ్యమవుతుంది.
– నాలుగున్నరేళ్ల పాలనలో సాధికారత సాధించేందుకు విద్య, వైద్యంలో జగనన్న  విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
– ఉన్నత చదువులు చదవడం వల్ల ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీరు, డాక్టరు, లాయరు తయారవుతారు. ఆ కుటుంబం తలరాతలు మారుతాయి. 
– పిల్లలు చదువుకొనేందుకు  జగనన్న అమ్మ ఒడి తెచ్చారు. జగనన్న గోరుముద్ద అందిస్తున్నారు.
– వసతి దీవెన, విదేశీ విద్యా దీవెనతో జగనన్న ప్రభుత్వం అండగా ఉంటోంది. చదువుల ఒరవడి, విద్యా విప్లవం చూస్తున్నాం. 
– చంద్రబాబు హయాంలో 1059  ఉన్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,257కు పెంచి పేదలను ఆదుకున్న దేవుడిగా నిలిచిన జగనన్న.
– గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తెచ్చారు. 
– రోగి కోలుకొనే సమయంలో రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా ఇస్తున్న జగనన్న. 
– 17 మెడికల్‌ కాలేజీలతో కలలను సాకారం చేస్తున్నారు. ఇప్పటికే ఐదింటిని ప్రారంభించారు..
– చంద్రబాబు హయాంలో స్కూళ్లు బాగు చేయాలని, మంచి భోజనం ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. మిడ్ డే మీల్స్‌లోనూ దోచుకున్నారు. ఒక్క గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీనీ తీసుకురాలేదు.
– మన బీసీలు, మన ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను జగనన్న నాలుగు దిక్కులు అనుకున్నాడు. 
– ప్రతి సంక్షేమ పథకంలోనూ ముస్లింలకు తోఫా ఇస్తున్న జగనన్న.

 ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... 

– అణగారిన వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్‌.
– రూ.2.50 లక్షల కోట్లు ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందాయి.
– గతంలో అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జల్లెడ పట్టి వెతికినా సంక్షేమ పథకాలు ఆగిన వ్యక్తి కనపడలేదు. ఇదీ జగనన్న పాలనకు నిదర్శనం. 
– తాడేపల్లిలో స్థిరమైన నివాసం ఉంటూ నిరంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా కృషి చేస్తున్న జగనన్న. 
– రాష్ట్రంలో అడ్రస్‌లేని వ్యక్తులు, పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి.

 ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... 

– ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లి దేహీ అని అడగాల్సిన పని లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటికే ఇస్తున్న పరిస్థితి. 
– ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలనూ నిలబెడతామని బీసీ గర్జనలో చెప్పాం.
– రాజ్యసభ సభ్యులుగా బిజినెస్‌మెన్లకే కాదు, నలుగురు బీసీలకు అవకాశం ఇచ్చిన జగనన్న.
– మంత్రులు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలకు వెతికి వెతికి ఇచ్చిన జగనన్న.
– నాడు–నేడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెచ్చి సమూలంగా విద్యావ్యవస్థను బాగు చేశారు. 
– నాలుగున్నరేళ్లలో మా పార్లమెంటుకు ఒక మెడికల్‌ కాలేజీ తెచ్చుకున్నాం.
– వరికపూడిశెల ప్రాజెక్టు ఈనెల 17న సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నాం. 
– రూ.3 వేల కోట్లతో రహదారులు శాంక్షన్‌ చేయించుకున్నాం. 3 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం. 

 ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... 

– మన పిల్లల ఫీజులు కట్టి, అమ్మ ఒడికి డబ్బులు ఇచ్చిన జగనన్న. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నారు. 
– చంద్రబాబు రాజకీయాల కోసం పింఛన్‌ పెంచుతానన్నాడు. జగనన్న అవ్వాతాతల కోసం రూ.3 వేలకు పెంచుకుంటూ పోతున్నారు. 
– చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పథకం వెన్నుపోటు. దాని ద్వారా రామారావును చంపాడు. సైకిల్‌ను, హోదాను లాక్కున్నాడు. 
– పేద పిల్లల ఇంగ్లీషు మీడియం విద్యపై కోర్టుకెళ్లిన చంద్రబాబు.
– బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జగనన్న రాజధాని అమరావతి ప్రాంతంలో 53 వేల ఇళ్ల స్థలాలిస్తే, అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండటానికి లేదని కోర్టుకు వెళ్లిన చంద్రబాబు.
– తాడేపల్లిలో నేనున్నాను.. నా పక్కనే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు ఉండాలని ఇక్కడే స్థలాలిచ్చిన జగనన్న.
– పేదల ఆకలిడొక్కలను తడిమి చూసిన జగనన్న. వారి ఆకలి తీరుస్తున్నాడు.
– సామాన్య కార్యకర్తను పార్లమెంటుకు పంపిన జగనన్న. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన జగనన్న. 
–  దళితులకు 5 మంత్రి పదవులిచ్చారు. దళిత మహిళను హోంమినిస్టర్‌ను చేసిన ఘనత జగనన్నది. హెల్త్‌ మినిస్టర్‌గా బీసీ మహిళను చేశారు. 

 ఎమ్మెల్యే  కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... 

– ఇంతకు ముందు బడ్జెట్‌ రూ.100 ఉంటే ఇన్నేళ్లలో ఆ వందలో కనీసం 10 రూపాయలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఖర్చు చేయలేదు. 
– జగనన్న నాలుగున్నరేళ్లలో రూ.5 లక్షల కోట్లు కేవలం పేద ప్రజల కోసం, చదువులు, తల్లుల ఆర్థిక సాధికారత కోసం వెచ్చించారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 
– రాజకీయ సామాజిక సాధికారత కల్పించి బడ్జెట్‌లో 50 శాతం నిధులు పేదవారికి ఖర్చు పెడుతున్న జగనన్న.
– ఇంతకు ముందు వేదికలపై రాయపాటి సాంబశివరావు, హనుమయ్య, కోటేశ్వరరావు లాంటి వారే కూర్చొనేవారు. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూర్చుంటున్నారు. 

 *ఎమ్మేల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ...*

– ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అమరావతి–బెల్లంకొండ రోడ్డు శివుడి సాక్షిగా హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చాం. శరవేగంగా పనులు సాగుతున్నాయి.
– సదావర్తి భూములు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆక్రమించేందుకు పన్నాగం పన్నాడు. ఆ శంకరుడి భూములు  ఆపేందుకు ఈ శంకరుడు వస్తాడని చెప్పాను. 
– రూ.149 కోట్లతో బెల్లంకొండ రోడ్డు శాంక్షన్‌ చేయించాం. కోర్టులో కేసు వేసి ఆపేందుకు యత్నించారు. 
– రూ.66 కోట్లతో జగ్గయ్యపేట నుంచి బ్రిడ్జిని నిర్మించేందుకు శాంక్షన్‌ చేయించుకున్నాం. టెండర్లు సిద్ధమవుతున్నాయి.
– 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ అమరావతి నుంచి ఆ అమరావతికి రోడ్డు కూడా వేయలేదు. 
– దాన్ని రూ.44 కోట్లతో శాంక్షన్‌ చేయించాం. అదీ జగన్‌మోహన్‌రెడ్డి గారి హయాంలోనే జరుగుతోంది. 
– నియోజకవర్గంలో స్కూళ్లకు రూ.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. 

 సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ.... 

– పల్నాడు ఏరియాలో మన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఉన్నారు, వాళ్ల కోసం వెళ్లాలి అని జగనన్న నాకు చెప్పారు.
–  జూ లకటక అనే సినిమా షూటింగ్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. గొప్పవాళ్లు మాట్లాడటాన్ని చూసి 6 భాషలు నేర్చుకున్నా. మన పిల్లలు ఇంగ్లీష్‌ నేర్చుకోకూడదా? 
– ప్రపంచం మారాలి, మన పిల్లలు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలనేది జగనన్న ఆలోచన.
– వైయస్సార్‌ గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకరికి బాగోలేకపోతే వెళ్లాను. గవర్నమెంట్‌ తరఫున సాయం చేయాలని కోరాం. 15 సంవత్సరాల కిందటే రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ వ్యక్తి కళాకారుడు అని చూశారు. దటీజ్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు. మళ్లీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. 
– జగనన్న మాట ఇస్తే తప్పడు. మడమ తిప్పడు. నాలుగు రోజుల కిందట 11 వేల మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
– ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కష్టాలు పాదయాత్రలో చూసి నవరత్నాల ద్వారా సమస్యలు తీర్చిన జగనన్న. 
– పెదకూరపాడులో 20 షాదీఖానాలు కట్టించిన నంబూరు శంకర్‌రావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ధన్యవాదాలు.

Back to Top