తణుకు: సామాజిక సాధికార బస్సు యాత్రతో తణుకు దద్దరిల్లింది. భారీ జనసందోహం నడుమ బస్సుయాత్ర సాగింది. అడుగడుగునా వైయస్సార్‌సీపీ జెండాలతో హోరెత్తగా ఇసకేస్తే రాలనంతగా ప్రజలు తరలి వచ్చారు. ఉరిమే ఉత్సాహంతో నేతలు ప్రసంగించారు. జగనన్న కటౌట్లు, జగన్ నామస్మరణతో పట్టణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, జోగి రమేష్, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, నందిగం సురేష్, మండలి చైర్మన్ మోషేన్ రాజు, సినీ నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..... – దేశ చరిత్రలో పేద ప్రజల కోసం ఆలోచించిన సీఎం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం ఆలోచించిన సీఎం.. బలహీన వర్గాల కుటుంబాలు బాగుండాలని కోరుకొనే సీఎం జగనన్న. – ఆయన సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు మారాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ కులాలు బాగుపడ్డాయి. – ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి, బీసీల తోకలు కత్తిరిస్తానన్న వ్యక్తి, బీసీలు జడ్జిలుగా పనికి రారన్న వ్యక్తి చంద్రబాబు. – రూ.2.40 లక్షల కోట్లు పేద ప్రజలకు ఆశ్రిత పక్షపాతం లేకుండా, అర్హతే ప్రామాణికంగా ఇచ్చిన జగనన్న. ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందింది. – 2.07 లక్షల ఉద్యోగాల్లో, ఇంటి పట్టాల పంపిణీలో, పేదవాడి చదువుల్లో అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. – చంద్రబాబు, పవన్ కల్యాణ్ 648 వాగ్దానాలిస్తే, ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. మళ్లీ వస్తున్నారు. – జగనన్న రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడు. అలాంటి సీఎంను కాపాడుకోవాలి. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.... – నాలుగున్నరేళ్ల జగనన్న పాలనలో సామాజిక సాధికారత సాధించాం. – సామాజిక న్యాయం అనేది కేబినెట్‌లోనే కాదు.. కింది స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో జరిగింది. – జ్యోతిరావు పూలే ఆలోచనలతో, జగ్జీవన్ రామ్ పరిపాలన దక్షతతో జగనన్న చక్కటి పాలన అందిస్తున్నారు. – గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా అమ్మ ఒడి పథకం ఉందా? – మన బిడ్డల్ని చదివించేందుకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, నాడు–నేడు ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. – ఓటు హక్కులేని పిల్లల కోసం కూడా వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న జగనన్న. – అప్పుల భారం ఉన్నా, కరోనా విపత్తుతో అధిక భారం పడినా వెనుకంజ వేయకుండా ప్రతి హామీని నెరవేర్చారు. – రాష్ట్రంలో పేదరికాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.... – ఎన్నికల ముందు చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి. – వాలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేస్తున్నారు. – డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా, నాడు–నేడు స్కూళ్ల ద్వారా రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి పిల్లలకు ఇంగ్లీషు మీడియం సహా గొప్ప చదువులు చెప్పిస్తున్నారు. – రూ.65 వేల కోట్లు పెద్దవాళ్లకు ఖర్చుపెడితే ఓట్లు వస్తాయని కొందరు అంటే, నాకు ఓట్లు ముఖ్యం కాదన్న జగనన్న. – రాష్ట్రమంతా పేదవాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచన చేసి జల్లెడ పట్టి ఆరోగ్య సురక్ష తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. – పక్కరాష్ట్రాలు, భారత దేశమంతా ఏపీవైపు చూసేలా పాలన. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్నదే. – నా నియోజకవర్గంలో రూ.2,800 కోట్లకుపైగా సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత జగనన్నదే. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.... – చంద్రబాబుకు సామాజిక వర్గం అంటే ఆయన సామాజికవర్గం. జగన్ గారికి సామాజిక వర్గం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. – ఒక అబద్ధం 14 ఏళ్లు పాలించింది. పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు అనుకోలేదు. – మనపాలిట సంజీవని ఆరోగ్యశ్రీ, డబ్బున్నోడికి జబ్బు చేస్తే డబ్బు కట్టాలి. పేదోడికి జబ్బు చేస్తే గవర్నమెంట్ ఆస్పత్రిలో డబ్బు కట్టక్కర్లేదు. – ఆరోగ్యశ్రీని సగానికి తగ్గించేసిన చంద్రబాబు. – ఏ బీసీ పిల్లాడైనా పది తర్వాత పెద్ద చదువు చదవాలంటే కష్టమయ్యేది. అలాంటి వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే వరం ఇచ్చింది వైయస్సార్. – అమరావతిలో పేద వర్గాలుంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందన్న చంద్రబాబు. – ఏ వివక్షతో చంద్రబాబు ఏ కులాలను చూశాడో, అవమాన పరిచాడో ఆ కులాలు నా కులాలన్న జగనన్న. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... – రామోజీరావు సామాజిక వైఫల్య యాత్ర అని పేపర్లో రాశాడు. ఒక్కసారి తణుకు రా రామోజీ. – బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంటే, కాపులంటే రామోజీ, రాధాకృష్ణకు ఎందుకంత కడుపుమంట? – జనం లేరని పేపర్లలో రాస్తున్నారు. మా వర్గాల పట్ల మీకున్న బుద్ధిని, మీ పేపర్లో రాసే రాతలే స్పష్టంగా చెబుతున్నాయి. – స్వతంత్ర భారత చరిత్రలో 28 రాష్ట్రాల్లో సామాజిక సాధికారతను, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా సామాజిక ధర్మాన్ని పాటించారా? – దళిత మహిళను హోంమంత్రిని చేసిన ఘనత జగనన్నది. – 2014 మేనిఫెస్టోని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చేశారు? దీనికి సమాధానం చెప్పిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయండి. – బీసీలు, మైనార్టీలకు ఏమీ చేయని సన్నాసులు చంద్రబాబు, పవన్. – మా విజయాన్ని ఎవరూ ఆపలేరు. 2024లో 175 సీట్లూ గెలవబోతున్నాం. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... – గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా అందరూ గమనించాలి. – ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చిన వ్యక్తి జగన్ గారు. – ఇంతకు ముందు పరిపాలన చూడండి. చంద్రబాబు 648 హామీలిచ్చారు. గాలికి విడిచిపెట్టారు. వెనుకబడిన వర్గాలకు 112 హామీలిచ్చి విడిచిపెట్టారు. – జగన్‌గారు నూటికి నూరూ అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి. – 50 సంవత్సరాల చరిత్రలో ఉత్తరప్రదేశ్‌లో 20 లక్షల ఇంటి పట్టాలే ఇచ్చారు. కానీ నాలుగున్నరేళ్లలోనే జగన్ గారు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చారు. – దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులిచ్చిన ప్రభుత్వం మరొకటి లేదు. – సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా లబ్ధి పొందని కుటుంబం రాష్ట్రంలో లేదు. – కోవిడ్ నివారణలో, ప్రజలను ఆదుకోవడంలో మొదటి వరుసలో ఉన్నారని పార్లమెంటులోనే ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... – మన జీవితాల్ని చిన్నచూపు చూసిన చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అన్న జగనన్న. – మన ఆకలి డొక్కలను పాదయాత్రలో చూసిన జగనన్న. – పేదవాళ్లంతా అలసిపోయారు, వాళ్ల పల్లకీ మనం భుజాన మోయాలని గొప్ప పాలన చేస్తున్న జగనన్న. – అప్పుడున్న బడ్జెట్ ఒకటే, ఇప్పుడూ ఒకటే. అప్పుడు సంపద ఏమైందని అడిగితే సమాధానం లేదు. – ఈ నాలుగున్నరేళ్లు సంపద పేద వాళ్ల అకౌంట్లలో వేసిన దమ్మున్న నాయకుడు జగనన్న. – చంద్రబాబు మనవడు ఇంగ్లీషు మీడియం చదవొచ్చు, పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవొద్దని కోర్టుకు వెళ్లాడు. – విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంటుంది. నా ఆశలు, మీ జీవితాలు తెలిసిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపుతున్నట్లు అనిపిస్తుంది. – పేదవాడు పార్లమెంటుకు వెళ్లేలా చేసిన ఘనత జగనన్నది. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.... – ఎవరి పేరు చెబితే చంద్రబాబుకు, లోకేష్‌కు దిమ్మ తిరిగి మైండ్‌బ్లాంక్ అవుతుందో ఆ పేరు జగనన్న. – రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి చంద్రబాబు నిలబెట్టుకోలేదు. – మహిళలకు డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు. – మీ బంగారం బ్యాంకుల్లో నుంచి విడిపించలేదు. బాబొస్తే జాబొస్తుందని మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చాడు? – నమ్మించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికాడు. – చంద్రబాబు దిగిపోతూ ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లే. పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే రూ.8500 కోట్లు అవుతుంది. – రూ.వంద కోట్లు మిగిల్చి రూ.2 లక్షల కోట్లతో అమరావతి ఎలా కడతాడు? – నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నామైనార్టీ అంటూ 67 శాతం మందిని మంత్రులను చేసిన జగనన్న. – చంద్రబాబు ఒక్క బీసీనైనా, ఎస్సీనైనా, మైనార్టీనైనా రాజ్యసభకు పంపాడా? రూ.100 కోట్లు, 200 కోట్లకు ఆ సీట్లు అమ్ముకున్నాడు. – జగనన్న బటన్ నొక్కుతున్నాడు. మీ అందరికీ లక్షల రూపాయలు వచ్చాయి. రేపు పోలింగ్ స్టేషన్‌లో ఫ్యాను గుర్తుకు మనమంతా బటన్ నొక్కుదాం. శాసనమండలి చైర్మన్‌మోషేన్ రాజు, మాట్లాడుతూ.. – సాధికారత అంటే గతంలో కొన్ని పార్టీలకు అది ఒక నినాదం. కానీ జగనన్న ప్రభుత్వానికి ఇది ఒక విధానం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వారిని సమానంగా చూడాలని, పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది. – అంబేద్కర్ ఆలోచన విధానాలతో సమాజంలో ఎస్సీలు, బీసీలు, పేద వర్గాలు, రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న జగనన్న. – దళిత వర్గానికి చెందిన నన్ను శాసనమండలి చైర్మన్‌గా చేసిన ఘనత సీఎంది. నటుడు ఆలీ మాట్లాడుతూ... – నేను భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ నేల అల్లుడిని. – విశాఖలో సమ్మిట్ జరిగితే అంబానీ, అదానీ, టాటా, మహీంద్రా గ్రూప్ ప్రతినిధులు వచ్చారు. జగనన్నపై నమ్మకంతో పరిశ్రమలు పెడతామన్నారు. – పరిశ్రమలు వస్తే ఇంట్లో నలుగురుంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినా మంచి జరుగుతుంది.