జగనన్న వల్లే సంక్షేమం.. సాధికారత 

వెనుకబడ్డ వర్గాలను చెయ్యిపట్టి ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగనన్న – డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

 జగనన్న మనకు, మన పిల్లల భవిష్యత్తుకు అవసరం – మంత్రి మేరుగ నాగార్జున

 సంక్షేమపాలనకు, సామాజిక సాధికారతకు రోల్‌మోడల్‌ సీఎం జగన్‌  – ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

 మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన జగనన్న   – ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

 సంక్షేమానికి, సాధికారతకు నాడు వైఎస్సార్, నేడు వైఎస్‌ జగన్‌ ఛాంపియన్లు – జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

 రాజం పేట  నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజ‌య‌వంతం

రాజంపేట:  సామాజిక సాధికార యాత్రలో వేలాదిగా జనం పాల్గొన్నారు.  బహిరంగ సభలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సభ ఆసాంతం కదలకుండా ఉన్నారు ప్రజలు. మధ్యమధ్యలో జై జగన్‌ నినాదాలతో సభాస్థలి దద్దరిల్లింది. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన ఇక్కడ జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ రమేష్‌, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డితో పాటు అనేకమంది స్థానిక సంస్థల నాయకులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ...
–భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు అవుతోంది. కానీ సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే ఉండిపోయింది. 
–కానీ మన రాష్ట్రంలో, జగనన్న పాలనలో సామాజిక సాధికారత ఒక విధానంగా మారింది.
– సామాజిక న్యాయంతో..సామాజిక సాధికారత సాధించి చూపారు సీఎం జగనన్న. 
–తక్కువ కులాలుగా చూసి అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు అయితే.. వారిని అక్కున చేర్చుకుని..వారి జీవితాలు ఉన్నతంగా ఉండాలని అనుక్షణం తపించిపోతున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి.
– కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో  ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచడమే కాకుండా. రాజకీయంగా ఉన్నత పదవులచ్చి..సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.
–వెనుకబాటు వర్గాలకు చెయ్యిపట్టుకుని మరీ ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగనన్న.
–ప్రతి కుటుంబం, ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, పేద కుటుంబాలకు  చెందిన వారు జగనన్న హయాంలో తమకు జరిగిన మేలు గురించి ఆలోచించాలి. 
–బాబు హయాంలో తమ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు జగనన్న పాలనలో తమ జీవితాలు ఎలా ఉన్నాయి? అన్నది ఆలోచించాలి అందరూ. అప్పుడు జగనన్న ఎంత గొప్ప నాయకుడో, మనస్సున్న మనిషో అర్థమవుతుంది.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ...

–జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సామాజిక సాధికారత సాధించి, మన జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టారు.
– గతంలో మహానుభావులెందరో సామాజిక సాధికారత కావాలని ఉద్యమాలు చేశారు. అవేవీ ఫలించలేదు.
–కానీ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సామాజిక సాధికారత వచ్చింది. సామాజిక న్యాయం వచ్చింది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు గుండెమీద చేయివేసుకుని బతికే రోజులు వచ్చాయి.
–చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బీసీలు జడ్జిలుగా పనికిరారని, మరొకరిని మీ తోకలు కట్‌ చేస్తానని, ఇలా వెనుకపడ్డ ప్రతి వర్గాన్ని కించపరిచిన చంద్ర బాబు దురహంకారి.
–31లక్షల ఇళ్లపట్టాలిస్తే, అగ్రతాంబూలం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకే. ఇక వారి పిల్లల చదువులు వారికి భారం కాకుండా చేశారు ముఖ్యమంత్రి జగన్ . 
–ఇక పేదల ఆరోగ్యవిషయంలోనూ అద్భుత సాయం అందించేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి జగనన్న. 
–ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు చెందిన నలుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేసి తన పక్కన కూర్చోపెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
–ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల వేళ..ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోల్లో జగనన్న ఇక్కడ అందిస్తున్న సంక్షేమపథకాలను హామీలుగా ప్రకటిస్తున్నారు. 
–జగనన్న ఇక్కడ చేస్తోంది సంక్షేమపాలన. 
–జగనన్న మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తుకు అవసరం. 
–మన నమ్మకం జగనన్నే... ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని తీరాలి. అది మన బాధ్యత. మన కర్తవ్యం. 

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి
–తన సుదీర్ఘ పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు చూశారు. కన్నీళ్లు తుడిచారు. 
–లక్షలాది మంది బతుకు కష్టాలు తెలుసుకున్నారు.
– తమకోసం నడిచొచ్చిన నాయకుడిని జగన్‌మోహన్‌రెడ్డిలో చూసుకున్నారు ప్రజలు. ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. 
–అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
–ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 94వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు ఇంటిదగ్గరకే అందేలా చేశారు జగనన్న. మన ఒక్క నియోజకవర్గానికే సంక్షేమ,అభివృద్ధి పథకాలకు వేల కోట్లు అందించారు సీఎం జగనన్న. 

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
–జగనన్న మీద అభిమానంతో ఈ సామాజికసాధికార బహిరంగ సభకు వచ్చిన మీరంతా జగనన్న మంచి మనసును అర్థం చేసుకున్నవారని అర్థమవుతోంది. –భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నారంటే..ఇక్కడ సమర్ధంగా జరుగుతున్న పాలనవల్లనే.
–నా ఎస్సీ,నాఎస్టీ,నాబీసీ, నామైనార్టీలంటూ ఇన్నాళ్లు రాజకీయంగా,సామాజికంగా వెనుకబడిన వర్గాలన్నింటినీ..అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే జగనన్న ఒక్కరే.
–విద్యావ్యవస్థను పూర్తిగా మార్చేసి, పేదపిల్లలకు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు, కార్పొరేట్‌ స్థాయి విద్య అందేలా చేశారు జగనన్న. 
–ఇంగ్లీషు చదువులతో పేదల పిల్లలు, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్న...పేదల పెన్నిధి.
–ఈరోజు 3వేల పైచిలుకు వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చిన మేటి జగనన్న. ఆయన వల్లనే ఈరోజు ఎంత పేదవారైన కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలుగుతున్నారు. 
–ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. 
–ఈరోజు ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. పారదర్శకంగా పథకాలు అందుతున్నాయి. 
–ఈరోజు దేశం మొత్తం జగనన్న పథకాలను అనుసరించాలని చూస్తోంది.
–చంద్రబాబు హయాంలో ఓ వర్గం మినహా బాగుపడ్డవారంటూ ఎవరూ లేరు. 
–ఇక ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకైతే చంద్రబాబు అవమానించిన, చులకనగా చూసిన సందర్భాలెన్నో ఉన్నాయి. గతంలో ఆయన ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మోసకారి బాబు మనకొద్దు.
–జగనన్ననే మళ్లీ గెలిపించుకుందాం. జగనన్న మన అవసరం.

జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి

–నాడు రాజశేఖరరెడ్డితో మొదలయింది సామాజిక సాధికారత. 
–ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీంతో ఎంతో మంది బీసీ,మైనార్టీ వర్గాల పిల్లలు పెద్దపెద్ద చదువులు చదవగలిగారు. ఉన్నతస్థాయిల్లో పనిచేస్తున్నారు. 
–ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంతకు రెట్టింపుగా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నారు. 
–నా బీసీ,నా ఎస్సీ,నాఎస్టీ, నా మైనార్టీలంటూ వారిని ఎంతో ప్రేమిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
–పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. వారి తల రాతలు మార్చాలని తపించే నాయకుడు జగనన్న. 
–మన ప్రాంతంలో అభివృద్ది జరుగుతుందంటే. అభివృద్ధి కనిపిస్తుందంటే అది ఆరోజు వైఎస్‌.రాజశేఖరరెడ్డి, నేడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే.

Back to Top