కర్నూలు: నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గం నలుమూలల నుంచే కాక, పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున హాజరు కావడం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నాయకుల ఉపన్యాసాలు ఆసక్తికరంగా సాగాయి. జైజగన్ నినాదాలతో సభాస్థలి హోరెత్తింది. మంత్రి ఆదిమూలపు సురేష్ –జనహృదయ నేత జగనన్న. ఆయన ప్రజల గుండెల్లో ఎంతగా ఉన్నారన్నది ఈ బహిరంగసభలో స్పష్టంగా కనిపిస్తోంది. సమయం ఎంతవుతున్నా పట్టించుకోకుండా, ఈ సభలో ప్రజలందరూ అలాగే ఉన్నారంటే ..జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. – ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సంక్షేమపథకాల వెల్లువ గురించి అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించే విషయంలోను.. జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. – వలంటీర్ల వ్యవస్థ, గ్రామసచివాలయాలు జగనన్న సృష్టి. ఈరోజు ఆ వ్యవస్థల గురించి దేశంలో చర్చలు సాగుతున్నాయి. జగనన్న సంక్షేమపథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని, ఆయా రాష్ట్రాల నాయకులు ఆలోచిస్తున్నారంటే.. ఇక్కడ ఎంత సమర్ధపాలన జరుగుతోందో అర్థం చేసుకోవాలి. –విద్య,వైద్యం,అధికార పదవుల ద్వారా ఈరోజు మనకు సాధికారత వచ్చింది. –ఈరోజు పేదరికం మన పిల్లల పెద్ద చదువులకు అడ్డంకి కాదంటే జగనన్న వల్లనే. కార్పొరేట్‌స్థాయి చదువులు చదువుతున్నారంటే. ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారంటే..ఇది కాదా విద్యా సాధికారత. –అలాగే ఆరోగ్యరంగంలోనే విప్లవాత్మకమార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25లక్షల వరకు వైద్యసాయం అందించాలని సీఎం జగనన్న నిర్ణయం తీసుకున్నారు. పేదల గురించి ఇంతకన్నా గొప్పగా ఆలోచించే నాయకుడు మరొకరు ఉన్నారా? –మన రాష్ట్రంలో సంక్షేమపథకాలను చూసినా, అభివృద్ధిని గమనించినా జగనన్న సమర్ధపాలన వల్లే. మానవత్వం వల్లనే. – మహనీయులు అంబేడ్కర్,ఫూలే, బాబూ జగజ్జీవన్‌రామ్ ఆదర్శాలను..తన ఆశయాలుగా మార్చుకుని పాలన చేస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన బాగుకోసమే అన్నది మరిచిపోకండి. మంత్రి గుమ్మనూరు జయరాం –ఈరోజు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలంతా కలిసి..నాయకులుగా ఇలా మీ ముందుకు వచ్చారంటే జగనన్న వల్లనే. ఆయన పార్టీ పెట్టడం వల్లే సామాజిక సాధికారత అంటే ఏమిటో మనకు తెలిసింది. –జగనన్న పార్టీ పెట్టిందే పేదల కోసమే. –మన కోసం, మన పిల్లలకోసం, మన అక్కాచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు సంక్షేమ పథకాలతో లక్షల కోట్లిచ్చారు జగనన్న. అది వారి ఖాతాల్లో నేరుగా వేశారు జగనన్న. ఇదంతా చేసింది మన ఆర్థికస్థాయిని పెంచడానికే. మన సామాజిక స్థాయిని పెంచడానికే. –మన రాష్ట్రంలో టీడీపీకి గ్యారంటీ లేదు. దానికి ష్యూరిటీ ఇచ్చేవాళ్లు లేరు. –నాలుగున్నరేళ్లలో జగనన్న పాలనలో ఐదు కోట్లమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన మంచి అంతా ఇంతా కాదు. –మనం వేసిన ఒక్క ఓటుకే జగనన్న ఇంత మంచి చేశారు. రేపు రాబోయే ఎన్నికల్లో మరో ఓటు వేద్దాం. జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకుందాం. –కర్నూలు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు..పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండాను మరోసారి ఎగరేద్దాం. –ఆరోగ్యశ్రీ ద్వారా 25లక్షల విలువైన వైద్యసాయం అందేలా చేసిన పెద్దమనసు ఎవరికి ఉంటుంది? జగనన్న లాంటి నాయకుడికే అలాంటి పెద్ద మనసు ఉంది. అందుకే ఆరోగ్యశ్రీ స్థాయిని పెంచి, పేదలకు మరింత భరోసా నిచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఎంపీ సంజీవ్‌కుమార్ –ఇది పేదల కాలం. అట్టడుగు వర్గాల కాలం. –పేదలంటే తెలీని వారే వైఎస్సార్‌సీపీని విమర్శిస్తున్నారు. – పెత్తందార్లు మనల్ని అణచివేయాలని చూస్తూనే ఉంటారు. –బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ధైర్యాన్నిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసిన జగనన్న, మనల్ని గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. –మన పేదల పెన్నిధి జగనన్న. ఆయనను మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ –మరోసారి కర్నూలులో జగనన్న పవరేంటో చూపించారు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. –మనం ప్రశాంతంగా బతకాలనుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి. –లంచాలు, వివక్ష అంటూ లేకుండా సంక్షేమపథకాలు ఇంటి గడపదగ్గరే అందేలా చేయడం సామాన్యవిషయం కాదు. – రూ.2.36లక్షల కోట్ల రూపాయలు డీబిటి ద్వారా లబ్దిదారుల ఖాతాలో వేసిన ఘనత జగనన్నదే. –జగనన్న పథకాలు పేదల ఆర్థిక స్థాయిని పెంచాయి. –సామాజిక సాధికారతతో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి, వారి సామాజిక స్థాయిని పెంచిన దార్శనిక పాలకుడు జగనన్న. – ఇక కర్నూలులో ఎన్నో అభివృద్ధి పథకాలు జగనన్న హయాంలోనే సాధ్యమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ –దారిపొడవునా వేలాది మందిగా తరలివచ్చిన కర్నూలు ప్రజలు జగనన్నపై అభిమానాన్ని గట్టిగా చాటారు. – దాదాపు రెండునెలలుగా సామాజికసాధికార బస్సుయాత్ర జరుగుతోంది. ప్రతిచోటా విజయవంతమవుతోంది. జగనన్న పాలనకు జేజేలు కొడుతున్నారు ప్రజలు. –రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర పండుగలా జరుగుతోంది. – తన పాదయాత్రలో బడుగు,బలహీనవర్గాలను, పేదలను దగ్గరగా చూసిన జగనన్న.. ఆ వర్గాలకు ఈరోజు పెద్దపీట వేశారు. – గత ప్రభుత్వంలో మైనార్టీలకు చోటే లేదు. ఈరోజు నలుగురు మైనార్టీ శాసనసభ్యులున్నారు. ఒక ఉపముఖ్యమంత్రి పదవిని మైనార్టీవర్గాలకే ఇచ్చారు జగనన్న. –జగనన్నను గెలిపించుకోవడం చారిత్రక అవసరం. ఆయనను గెలిపించుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి. –రాబోయే ఎన్నికలు పేదలకు,పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి. –జగనన్నను గెలిపించుకుంటే అది పేదల గెలుపవుతుంది. –ఈరోజు లక్షలాది మంది ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత జగనన్నదే. పేదల గడపల దగ్గరకే వచ్చి పథకాలు అందించి...వారి ఆత్మగౌరవాన్ని పెంచిన జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం అంటే మన స్థాయిని మరింత పెంచుకోవడమే కోసమే అని మరిచిపోకండి. – ప్రతి పేదవాడు బాగుండాలని కోరుకునే మనసున్న మనిషి జగనన్న.