పేదల పెన్నిధి జగనన్న

సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి జగనన్న పాలనలోనే చూస్తున్నాం –డిప్యూటీ సీఎం నారాయణస్వామి

వెనుకబడిన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న జగనన్న –డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

సంక్షేమపథకాలు ఇంటి చెంతకే చేరుతున్నాయి – ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి

పేదల పెన్నిధి, దార్శనికుడు మన ముఖ్యమంత్రి – ఎంపీ గురుమూర్తి

 బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లెలో సామాజిక సాధికార యాత్ర జైత్రయాత్రలా సాగింది. మైనారిటీలతో సమావేశం అనంతరం..సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, అంజాద్‌బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ...

 

–మనమంతా జగనన్న కుటుంబానికి చెందినవారం. అలా చెప్పుకుంటుంటే ఎంత గర్వంగా ఉంటుందో!

–జగనన్న సామాజిక సాధికారత అంటే...చంద్రబాబు నా కుల సామాజిక సాధికారత అని ఆలోచించే వ్యక్తి. 

–ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలు అభివృద్ధిలోకి వచ్చేందుకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య,వైద్యం వంటి రంగాల్లో హద్దులు లేకుండా అవకాశాలు కల్పించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.

–విద్యారంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమార్పులు పేదల పిల్లలకు, అణగారిన కుటుంబాల పిల్లలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. డబ్బున్న వాళ్ల పిల్లలకు తీసిపోని రీతిలో...ఈనాడు మన పిల్లలు చదువుతున్నారంటే ఎంతో గర్వించాల్సిన విషయం. 

–అలాగే వైద్యరంగంలోనూ పేదలకు గణనీయమైన వైద్యసేవలు అందుతున్నాయి. 

–కుట్రలు, కుతంత్రాల రాజకీయం చేసే చంద్రబాబు నక్కలాంటివాడు అయితే...పేదల సంక్షేమం కోసం ఎందాకైనా అనే సింహంలాంటివాడు జగనన్న. 

–ఈరోజున ఒక్క బనగానపల్లె నియోజకవర్గంలోనే డీబీటీ ద్వారా నేరుగా 1,83,197 మంది బీసీ లబ్దిదారులకు రూ.409.30 కోట్లు అందాయి. 95,737 ఎస్సీ లబ్దిదారులకు రూ.306.44 కోట్లు, 14,956 మంది ఎస్టీ లబ్దిదారులకు 24.85 కోట్లు అందాయి. 

–ఏ ఒక్కరూ పేదలుగా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో సంక్షేమఫలాలు నేరుగా, పారదర్శకంగా  ఇంటింటికి చేర్చిన ది గ్రేట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 

–పచ్చమీడియా సంస్థలకు చెందిన యజమానులు నాలుగుపడగల నాగుపాములా జగనన్నపై విషం చిమ్ముతున్నారు. ఆ నాలుగు పడగల పాముకు చంద్రబాబు సీఎం కావాలన్నదే లక్ష్యం. అది పగటికలగానే మిగిలిపోయేలా చేద్దాం.

 

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ....

 

- ఈరోజు బనగానపల్లె జనసంద్రమైంది. నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడే ఉన్నట్టుంది. 

–జగనన్న సైనికులమైన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలమైన మేము జగనన్న కటౌట్‌ పెట్టుకుని వచ్చాం. ఆ మాత్రానికే ఇంతమంది వచ్చారంటే...ఇక జగనన్న వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 

–దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లవుతోంది. సామాజిక సాధికారత నినాదంగానే  ఉండిపోయింది. 

–అన్ని రాష్ట్రాల్లో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ ఎవరూ అణగారిన వర్గాల గురించి ఆలోచించలేదు. 

–ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సాధికారతను ఒక విధానంగా మార్చేశారు. 

–వెనుకబడిన వర్గాలను వెన్నుతట్టి, చెయ్యిపట్టి నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న. 

- ఐదుగురు  ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలున్నారంటే ..అది జగనన్నే చలవే. 

–వెనుకబడిన కులాలను ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకున్న సందర్భం లేదు. ఇక బాబుగారి గురించి చెప్పాల్సిన పనిలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుగారు ఏనాడు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల గురించి ఆలోచించలేదు. పైగా వారిని అవమానించారు. చులకన చేశారు. హేళనగా మాట్లాడారు.

– చంద్రబాబు అంత నీచంగా ప్రవర్తిస్తే...జగనన్న ఒక ఎస్సీ మహిళను హోంమంత్రిని చేశారు. ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం చేశారు.

– ఒక్కరంటే ఒక్క మైనార్టీ.. బాబు కేబినెట్‌లో మంత్రిగా లేరంటే ఎంత సిగ్గు చేటు. తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా మైనార్టీని తీసుకున్న ఘనత జగనన్నదే. 

–ఇదే బనగానపల్లె నియోజకవర్గంలో78,431మంది మైనార్టీ లబ్దిదారులకు నేరుగా రూ.201.43 కోట్లు సంక్షేమపథకాల ద్వారా అందించిన ఘనత జగనన్నదే. నాన్‌డీబీటీ ద్వారా 7,598మంది మైనార్టీలకు 11.22 కోట్లు అందించారు. జగనన్న వల్లనే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన ధర్మం.

 

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.....

 

     - నలభైఏళ్ల రాజకీయాల అనుభవం వుందని చెప్పుకుంటూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు పేదలకు, అణగారిన వర్గాలకు చేసింది ఏమీలేదు. 

–ఈ నాలుగున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు ఎంత మేలు చేశారు. సంక్షేమ పథకాలు లెక్కలేనన్ని తెచ్చారు. పెన్షన్ల విషయంలో విప్లవాన్నే తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల విషయాల్లో జగనన్నకు, చంద్రబాబుకు పోలికే లేదు.

–గతంలో ఇంటికో ఉద్యోగం, బాబొస్తే జాబు వస్తుంది అంటూ ప్రతి ఇంటి గోడలమీద రాసి, ప్రచారం చేసుకున్న చంద్రబాబు ...అధికారంలో వచ్చి ఇచ్చిన జాబులే లేవు.

– లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగనన్న హయాంలో వచ్చాయి.

–అణగారిన వర్గాలు రాజ్యాధికారంలో భాగమైతేనే అభివృద్ధి చెందుతాయని, తన మంత్రి వర్గంలో ఐదుపదవుల్ని ఎస్సీలకే ఇచ్చారు. 

–శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎస్సీ వర్గం నుంచే ఇచ్చారు. 

–నామినేటెడ్‌ పదవుల్లో సింహభాగం ఇచ్చిన మనసున్న మనిషి ముఖ్యమంత్రి జగనన్న.

 

ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ....

 

–ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఎంత గొప్పగా జరుగుతోందో మనమందరం చూస్తున్నాం. 

–దివంగత నేత రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పథకాల ఒరవడిని మరింత పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది.

– చంద్రబాబు ప్రభుత్వ పనితీరును, ఈ ప్రభుత్వం పనితీరును ఒక్కసారి బేరీజు వేసుకోండి.

– సంక్షేమపథకాలు అందాలంటే నాడు ఎంతో కష్టపడాల్సివచ్చేది. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇంటి చెంతకే సంక్షేమపథకాలు అందుతున్నాయి.

–మనందరికీ సీఎం జగన్‌ చేసిన మేలు మరిచిపోవద్దు. మళ్లీ ఆయన్ను సీఎం చేసుకుని కృతజ్ఞతలు చాటుదాం.

 

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ...

 

– జగనన్న ...నాయకుడంటే సేవకుడు అనే పంథాలో పాలన సాగిస్తున్నారు. 

–బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌ బోన్‌ క్లాస్‌..ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలంతా నా మనుషులు’ అంటూ, ఆయా వర్గాలను సొంతం చేసుకున్నారు సీఎం జగన్‌. 

–నిన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాజకీయపార్టీలు ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుని వదిలేయగా, వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రభుత్వ పథకాలతో పాటు రాజకీయ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో సింహభాగం కేటాయించింది. 

–సామాజిక న్యాయంలో సీఎం వైఎస్‌ జగన్‌ దార్శనికత ప్రశంసనీయం. 

–ఓవైపు సామాజిక న్యాయం పాటిస్తూనే, మరోవైపు నేరుగా అణగారిన కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నిండేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

– అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్‌ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 

–బనగానపల్లె నియోజకవర్గంలో పదివేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇదే బనగానపల్లెలో మూడువేలమందికి ఇళ్లపట్టాలిచ్చాం. ఇక్కడ ఇచ్చిన పట్టాలపై స్టే తీసుకొచ్చిన దుర్మార్గుడు ఇక్కడి టీడీపీ నాయకుడు. ఇది టీడీపి రాజకీయం. 

–ప్రజల మంచికోసం నిరంతరం పనిచేసే పార్టీ మన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ.

Back to Top