సీఎం వైయ‌స్‌ జగన్ ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి 

మంత్రి ఆర్కే రోజా  

 రాష్ట్ర క్రీడాకారులకు ఎన్నో రకాల ప్రోత్సాహం 

టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానం

 విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు రోజా తెలిపారు. ఈ ఏడాది కాలంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సులు జరిగాయన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏడాదిగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు సంస్కృతిని ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఏపీ టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విజయవాడలో బెర్మపార్క్‌లో పర్యాటక అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో పర్యాటక శాఖలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులకు ఎన్నో రకాల ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.
 
ఒక కళాకారిణిగా తోటి కళాకారులకు తనవంతు సాయంగా జగనన్న సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని రోజా పేర్కొన్నారు. టూరిజం విభాగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఎంవోయూలు..గ్రౌండ్‌ లెవల్‌లో కార్యచరణ దిశగా ఉన్నాయన్నారు. ఒబెరాయ్‌ హోటల్స్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి రోజా  తెలిపారు. తిరుపతి టెంపుల్‌ టూరిజంతోపాటు విశాఖలో నేచురల్‌ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానంలో ఉందన్నారు.

టూరిజంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఉన్నపళంగా ఏపీకి రావడం వల్ల అనేక సదుపాయాలు కోల్పోయామని విమర్శించారు. చంద్రబాబు వల్ల ఎంతో మంది కళాకారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. టూరిజంలో 2023ని ఇయర్ ఆఫ్ విజిట్‌గా నిర్వచించారు. రాష్ట్రంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అరకు, లంబసింగి వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇంకా వాటిని అభివృద్ధి చేసి వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు.

Back to Top