గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ:  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top