సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వేడుక‌ల్లో  సీఎం సెక్రటరీ కే.ధనుంజయ రెడ్డి, సీఎం అడిషనల్‌ సెక్రటరీ డాక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Back to Top