సీఎం వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ పోలీస్‌ అసోసియేషన్ ప్ర‌తినిధులు

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఏపీ పోలీస్‌ అసోసియేషన్ ప్ర‌తినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రిని అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఆర్‌. రఘరామ్, పలువురు అసోసియేషన్‌ సభ్యులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు.

ఏపీఎస్పీ, ఏఆర్‌ పోలీస్‌ సిబ్బందికి బ్యారెట్‌ క్యాప్‌ నుంచి పీ క్యాప్‌ ఇచ్చి డ్రెస్‌కోడ్‌ మార్చిన ప్రభుత్వం, దీంతోపాటు పోలీసులకు సంబంధించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ పోలీస్‌ అసోసియేషన్‌ స్టేట్‌ ట్రెజరర్‌ ఎం.సోమశేఖర్‌ రెడ్డి, ఈసీ మెంబర్స్‌ టి.పెద్దయ్య, ఆర్‌.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, ఎం.సోమయ్య, బి.భవాని, ఎం.కామరాజు.

 

Back to Top