రేప‌ల్లెలో టీడీపీకి భారీ షాక్..

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు

టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దు:  ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు.

 
వేమూరు నియోజకవర్గం వరికూటి అశోక్ బాబు  నేతృత్వంలో చుండూరు, భట్టిప్రోలు,అమర్తలూరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా కేంద్ర పార్టీ కార్యలయానికి వచ్చి పార్టీలో చేరారు. వీరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  పార్టీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రేపల్లె పార్టీ సమన్వయకర్త ఈవూరి గణేష్ నేతృత్వంలో రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలలాకు చెందన టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,బాపట్ల పార్టీ జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణలు పార్టీ ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో సిఎం జగన్ సామాజిక న్యాయాన్ని  పాటిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైయ‌స్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. గడచిన  నాలు­గు­ సంవత్సరాల ఏడు నెలల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు సిఎం మేలు చేశారని గుర్తు చేశారు.సామాజిక సమతౌల్యత పాటిస్తూ  ఎస్సి,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక  చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న కాలంలో  పార్టీ సమతౌల్యత పాటిస్తుందని చెప్పారు. ఈ  నేపథ్యంలోనే  రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఈవూరి గణేష్, వేమూరు పార్టీ సమన్వయకర్తగా వరికూటి అశోక్ బాబును  జగన్ నియమించారని తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ సమన్వయ కర్త వరికూటి అశోక్ బాబు  మృదు స్వభావి ఆయన్ని వేమూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు...గతంలో వేమురిలో  వైఎస్ఆర్ సిపిని ఏ విధంగా అయితే గెలిపించారో అదే స్పూర్తితో అశోక్ బాబుని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.నియోజకవర్గ ప్రజలకు ఆయన న్యాయం చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చుండూరు వచ్చినప్పుడు డ్రైనేజి,రోడ్ల మరమ్మతులు  కోసం నాఎంపి లాండ్స్ నిధులు ఇచ్చానని ఆయన  గుర్తు చేశారు. ఎస్సి సామాజిక వర్గంలో వర్గ విభేదాలు సృష్టించెందుకు చూస్తున్నారని ఈ విషయాన్ని ఎవరు నమ్మవద్దనీ కార్యకర్తలకు వివరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు అండదండాలు కావాలని,ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేసే  అవకాశం లేదన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి బడుగు,బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన పార్టీ అని స్పష్టం చేశారు.. భవిష్యత్తులో  రాష్ట్రంలో  ఒంటరిగానే  పార్టీ వెల్తుందని అన్నారు. పేదవారని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చెందుకు జగన్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకేళ్తుందన్నారు..దేశంలోనే అగ్రగామి చేసేందుకు ఎం చర్యలు తీసుకోవాల అన్నింటినీ అమలు చేస్తామన్నారు.

60 రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు..జగన్  సిఎం అయితేనే రాష్ర్టంలో  అమలౌతున్న పధకాలు మరింత మెరుగ్గా ప్రజలకు  చేరువ అవుతాయని పేర్కొన్నారు.

మతతత్వ పార్టీలతో పోత్తు పెట్టుకోనే టిడిపిని నమ్మవద్దన్నారు.కేంద్రంతో సత్సంబంధాలు కోసమే పార్లమెంటులో బిల్లులకు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరమని చెప్పారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిపుల్ తలాక్ లాంటి బిల్లులకు మద్దతు పలకలేదని గుర్తు చేశారు. సెక్యులర్ భావాలకు   వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు మన పార్టీ ఎప్పుడు మద్దతు ఇవ్వలేదన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రానికి సహకారం అందిస్తూ వచ్చామన్నారు..మతతత్వపార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోత్తు పెట్టుకొదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీతో పోత్తు కోసం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి తహతహలాడుతోందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీతోను పోత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.

రేపల్లె నియోజకవర్గ టిడిపి,జనసేన నాయకులు పార్టీలో చేరిన అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...
నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త
ఈవూరు గణేష్ ను రేపల్లె ప్రజలంతా గెలిపించి మీకు సేవచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
పార్టీ కోసం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారని కోనియాడారు.. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారన్నారు..
రేపల్లె నుంచి ఈవూరు గణేష్ ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్ లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుందన్నారు..

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు మూడవ సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నరని అన్నారు..అతను నియోజకవర్గ ప్రజల అందుబాటులో ఉండరని ,సత్యప్రసాద్ హైదరాబాద్ లో కూర్చుని జూదం ఆడుకుంటాడని మండిపడ్డారు.. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ,లోక్ సభకు బిసి,ఎస్సీ,
ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి  జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారని అన్నారు..అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు.రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు..చంద్రబాబు లాగా మనం నటించడం లేదన్న ఆయన వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నామని చెప్పారు..పార్టీ
భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తుందని భరోసానిచ్చారు..

బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపి 
మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ
జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు గణేష్ ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారని చెప్పారు..ప్రతీ పేదవాడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు..రాష్ట్రంలోని ప్రతీ పేదవాడని ఆర్ధికంగా,రాజకీయంగా బలోపేతం చేయాలనేదే జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పుకొచ్చారు..మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారని,రేపల్లెలో ప్రతీ ఒక్కరూ ఈవూరు గణేష్ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునచ్చారు.పార్టీ కేంద్ర కార్యలయంలో వేమూరు,రేపల్లె నియోజకవర్గాలకు చెందిన టిడిపి, జనసేన పార్టీలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top