నేనున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా నిలిచారు 

  రమ్య తల్లి జ్యోతి

  గుంటూరు:  కూతురును పోగోట్టుకొని పుట్టెడు శోకంలో ఉండ‌గా నేనున్నాన‌ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ కుటుంబానికి పూర్తి అండగా నిలిచారని బీటెక్ విద్యార్థిని ర‌మ్య త‌ల్లి జ్యోతి పేర్కొన్నారు.   రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు.  తమ పెద్ద పాపకు ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ప్లాటు, పొలం కూడా ఇస్తామని చెప్పినట్లు జ్యోతి తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ను కోరారు.
 
త‌న‌ను కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెల్లిగా భావించి..
నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానని అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక తెలిపారు. బహుశా తనను కూడా ముఖ్యమంత్రి చెల్లిగా భావించి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసిందన్నారు. అధికారులు కూడా వెంట వెంటనే స్పందించారని తెలిపారు.  తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి మౌనిక ధన్యవాదాలు తెలిపారు. 

Back to Top