తూర్పు గోదావరి: అభివృద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలను రాజమండ్రి వైయస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ఖండించారు. అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైయస్ఆర్ సీపీ అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలగానూ 11 స్థానాలు బీసీలకు కేటాయించి వైయస్ఆర్ సీపీ పెద్దపేట వేస్తోందని వివరించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న సీఎం వైయస్ జగన్ మళ్లీ అధికారం రావాలని ప్రజల కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్లో వైయస్ఆర్ సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు శ్రీనివాస్ కోరారు.