పారదర్శక పాలన అందించాలి

గ్రామ సచివాలయ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

విజయనగరం: గ్రామ సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుష్ప శ్రీవాణి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలను ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారని వివరించారు.  మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నవారిని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. పేపర్‌ లీక్‌ అంటూ అసత్య ప్రచారాలు చేపట్టారని మండిపడ్డారు. 
 

Back to Top