వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన్న అప్పలనాయుడు సచివాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో అప్పలనాయుడుచేత ప్రమాణం చేయించారు. అనంతరం అప్పలనాయుడిని గవర్నర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. అప్పలనాయుడు ఈ ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.