జనహృదయపు నేత జగనన్న

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆరేళ్ల పండుగ‌
 

కాకినాడ‌:  ముఖ్యమంత్రి వై. య‌స్. జగన్ మోహన్ రెడ్డి జ‌న‌హృద‌య నేత‌గా నిలిచార‌ని హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దవులూరి దొర‌బాబు అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ ప్రజాసంకల్ప  యాత్ర  నేటికి ఆరేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. 2017  లో ప్రారంభించి 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు నడిచి సుమారు రెండు కోట్ల మంది ప్రజలను కలుసుకుని 6 సంవత్సరాలు  పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం  పెద్దాపురం వైఎస్సార్ విగ్రహం దగ్గర, సామర్లకోట వైయ‌స్ఆర్  విగ్రహం దగ్గర,  సామర్లకోట జగనన్న లే అవుట్ లో వైయ‌స్ఆర్ విగ్రహానికి పూల దండలు గజ మాలలతో సత్కరించి కేక్ కటింగ్ కార్యక్రమాలలో  రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్& పెద్దాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌ దవులూరి దొరబాబ, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Back to Top