చిరంజీవిపై పోస్టింగ్‌లు టీడీపీ కుట్ర

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చిత్తూరు: కుట్ర ఆలోచనలతో టీడీపీ తనపై దుష్ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో చిరంజీవిపై పోస్టింగ్‌లను ఆయన తీవ్రంగా ఖండించారు. చెవిరెడ్డి అభిమాన సంఘం పేరిట సర్క్యులేట్‌ చేసిన వార్తలు అవాస్తవమన్నారు. తనకు అభిమాన సంఘాలే లేవవని, పోస్టింగ్‌లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లు కూడా లేవని, చిరంజీవితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. 
 

Back to Top