తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకర్‌ను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..` రేపట్నుంచి రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని, 45 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. రేపట్నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రేపు పోస్టర్ల ఆవిష్కరణతో పాటు రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుంది, అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి వినతిపత్రాలిస్తాం, నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం, నవంబర్ 24న సంతకాల సేకరణ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి, నవంబర్ 25న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను అందజేస్తాం, మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం 17 మెడికల్ కాలేజీలు,టీచింగ్ ఆసుపత్రుల యజ్ఞానికి వైయస్ జగన్ శ్రీకారం వందేళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయి, జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు, ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు, మరో మూడు తుదిదశకు చేరుకున్నాయి, చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి మనసు రావడం లేదు, జగన్ మోహన్ రెడ్డి అన్ని సదుపాయాలు సమకూర్చినా చంద్రబాబు అడుగు ముందుకు వేయడం లేదు, పులివెందుల మెడికల్ కాలేజ్ పై చంద్రబాబు మనసులో కక్ష పెంచుకున్నారు, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదు, పీపీపీ వల్ల తన మనుషులకు లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన, ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీలను తన మనుషులకు పీపీపీలో ఇచ్చేశాడు, ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్లు డబ్బు తెచ్చుకుంటారు, ప్రజలు మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితిని తెస్తున్నారు పేదలపై చంద్రబాబుకి ఇంత కక్ష ఎందుకు? మెడికల కాలేజీల పై చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైయస్ఆర్ సీపీ తీసుకుంది, ఇందులో భాగంగానే జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నర్సీపట్నంలో పర్యటించారు, దేశమంతా సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత ఉంది, గత ఐదేళ్లలో సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరతను తీర్చే ప్రయత్నం చేశాం, పేదల కల నిజమవుతున్న సమయంలో చంద్రబాబు ఒక్కసారిగా మళ్లీ వెనక్కి తీసుకుపోయారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నారు, ఆ కుట్రను అమలు చేసే దిశగా చంద్రబాబు అడుగులు ముందుకు వేశారు..ఈ కుట్రను కచ్చితంగా తిప్పికొట్టాలి.