అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం వందశాతం నిజమైంది. రూ.4957 కోట్ల టెండర్‌కు మేఘా సంస్థ రూ.4359 కోట్లు కోట్ చేసింది. 12.6 శాతం తక్కువ పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకు వచ్చింది. రివర్స్ టెండరింగ్లో రూ.782 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ విషయంపై అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ..2014లో అప్పటి ప్రభుత్వం రూ.16 వేల కోట్ల పోలవరం అంచనాలను రూ.52 వేల కోట్లకు పెంచారని తప్పుపట్టారు. ఒకే సంస్థకు రెండు కాంట్రాక్టులు కట్టబెట్టి..అంచనాలు విఫరీతంగా పెంచారని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియ మీద పనులను బినామీలకు కట్టబెట్టుకున్నారు. నామినేషన్ ప్రక్రియ అన్నది ఎమర్జెన్సీ ప్రక్రియ చేపడుతారు. కానీ వందల, వేల కోట్ల కాంట్రాక్టులు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు అప్పగించారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై రివర్స్ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టారన్నారు.పారదర్శకంగా టెండర్లు పిలిచామన్నారు. ఇటీవల 65వ ప్యాకేజీలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.58.5 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యిందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టినట్లు చెప్పారు. రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ ఏవేవో మాట్లాడుతుందని తప్పుపట్టారు.