తాడేపల్లి: ఎల్‌జీ పాలిమర్స్‌లో రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్ఘటన వివరాలను సీఎం జగన్ ప్రధానమంత్రికి వివరించారు. తీసుకున్న సహాయ చర్యలను కూడా ఆయనకు తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. తాజా ప్రమాదంపై చర్చించేందుకు జాతీయ విపత్తు నివారణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. సహాయ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై సమీక్షిస్తున్నారు. అమిత్ షా, గవర్నర్‌తో మాట్లాడిన సీఎం వైయస్ జగన్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్‌తో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం వైయస్ జగన్ వివరించారు. మరికాసేట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఘటనాస్థలికి చేరకోనున్నారు. సహాయ చర్యలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు.