ఇది ఆరంభం మాత్రమే...హై కోర్టు వచ్చేవరకూ మా పోరాటం ఆగదు...

రాయలసీమ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 

"సీమ" గర్జన సూపర్ సక్సెస్

 దశాబ్దాలుగా గూడుకట్టుకున్న బాధను సీమవాసులు వ్యక్తపరిచారు

 సీమ గర్జన చూసైనా చంద్రబాబు వైఖరి మార్చుకోవాలి

  రాయలసీమ ద్వేషి చంద్రబాబు

  రాయలసీమ గర్జిస్తుంటే..  పచ్చ మీడియాలో తప్పుడు రాతలు-కూతలు

 కర్నూలుకు హైకోర్టు రాకుండా బాబు కేసులు వేయిస్తున్నాడు

  నాడు టీటీడీ కార్యాలయాలను అమరావతికి తరలించాలని చూసింది బాబే

   వైయ‌స్ఆర్‌ పోతిరెడ్డిపాడు నిర్మిస్తుంటే.. ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేయించింది కూడా చంద్రబాబే

 

క‌ర్నూలు:  రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న ఆరంభం మాత్రమే...హై కోర్టు వచ్చేవరకూ మా పోరాటం ఆగదని రాయలసీమ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు రాయలసీమ ప్రజల గర్జన చూసైనా చంద్రబాబులో మార్పు రావాలి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వేసిన కేసులు ఉపసంహరించుకుని మనస్ఫూర్తిగా కర్నూలులో హైకోర్టు వచ్చేలా సహకరించాల‌ని సూచించారు. క‌ర్నూలులో నిర్వ‌హించిన‌ రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న విజ‌య‌వంత‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి,  హఫీజ్‌ ఖాన్, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు. సోమ‌వారం క‌ర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో వారు మీడియాతో మాట్లాడారు.

గర్జన చూసైనా చంద్రబాబులో మార్పు రావాలి: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
     రాయలసీమ గర్జనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలనే భావన ప్రజల్లో చాలా  బలంగా ఉంది.  ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తీసుకున్నారు. రాయలసీమ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసి, గర్జన సభలో భాగస్వాములయ్యాం. మూడు రాజధానులు కావాలా..? నాలుగు రాజధానులు కావాలా.. అంటూ కర్నూలు వచ్చి చంద్రబాబు వికేంద్రీకరణ గురించి హేళనగా మాట్లాటంలోనే అతని నైజం బయటపడింది. రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 1953లో రాజధానిగా ఉన్న ఈ ప్రాంతాన్ని, తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని వదులుకున్నాం. కనీసం హైకోర్టు అయినా ఇక్కడ ఉండాలనే భావనను ఇక్కడి ప్రజలు  వ్యక్తపరిచారు. రాయలసీమ గర్జన చేస్తుంటే.. పచ్చ మీడియాకు ఎందుకింత బాధ..? కించపరిచే రాతలు ఎందుకు రాస్తున్నారు..?. ఇప్పటికైనా, వికేంద్రీకరణపై టీడీపీ నేతలు వేసిన కేసులు ఉపసంహరించుకుని హైకోర్టుకు, మూడు రాజధానులకు సహకరిస్తామనే మాట వారి నోటి నుంచి రావడం లేదు. దీన్ని బట్టి చంద్రబాబు రాయలసీమను ఎంతగా ద్వేషిస్తున్నాడో అర్ధం అవుతోంది. మా నాయకుడు శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ఈ రోజు రాయలసీమ ప్రజల గర్జన చూసైనా చంద్రబాబులో మార్పు రావాలి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వేసిన కేసులు ఉపసంహరించుకుని మనస్ఫూర్తిగా కర్నూలులో హైకోర్టు వచ్చేలా సహకరించాలి. చంద్రబాబునాయుడు రాయలసీమకు ఏమీ చేయలేదు. మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి సీమ కరువును శాశ్వతంగా పారద్రోలాలని చర్యలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు రాయలసీమ లిఫ్ట్‌ స్కీం తీసుకొస్తుంటే.. దానిపైనా కోర్టుకు వెళుతున్నారు. చంద్రబాబుకు రాయలసీమపై ఎందుకింత ద్వేషం...? 
 

  •  చివరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కార్యాలయాలను కూడా ఆనాడు చంద్రబాబు అమరావతి తరలించాలని చూశాడు. మేం మా ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందాలి అని కోరుకోవడం లేదు...అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనే రాయలసీమ వాసులు కోరుకుటున్నారు. మాపై ఎదురుదాడి చేయడం, సీమవాసుల గురించి హేళనగా మాట్లాడటం కాదు.
  •  చంద్రబాబు సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 
  •  ఆనాడు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారు పోతిరెడ్డిపాడు నిర్మిస్తుంటే ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేయించింది మీరు కాదా బాబూ..?.
  •  కర్నూలులో హైకోర్టు పెడతానంటే అడ్డుకుని కేసులు వేయించింది మీరు కాదా బాబూ..?.
  •  చంద్రబాబుతో పాటు ఆయన మీడియాకు కూడా రాయలసీమ వాసులంటే చులకన భావంతో చూస్తోంది. సభ భారీ సక్సెస్‌ అయితే జనం రాలేదంటూ చూపిస్తున్నారు. హైకోర్టు వస్తే రెండు టీ బంకులు వస్తాయని ఇంత పెద్దఎత్తున ప్రజలు ఈ రోజు కదం తొక్కేవారా.. అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
  •  రాయలసీమ హక్కుల కోసం ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఈ సభను సక్సెస్‌ చేసినందుకు జేఏసీకి ప్రత్యేక కృతజ్ఞతలు.
  • వందేళ్ళ ఆకాంక్షకు తగ్గట్టుగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హామీ: ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్ 

    ఈ గడ్డకు అన్యాయం జరుగుతుందని రాయలసీమలోని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఈ రోజు జేఏసీ కల్పించిన అవకాశం మేరకు.. సీమ ప్రజలు తమ బాధను వ్యక్తపరిచారు. ఈ ప్రాంతానికి వందేళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతాన్ని, ఇక్కడ బలిదానాలను, బాధను ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు గుర్తించారు. వందేళ్ళ ఆకాంక్షకు తగ్గట్టుగా, ఈ ప్రాంతానికి హైకోర్టు ఇస్తానని సిఎం గారు హామీ ఇచ్చారు. దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అండ్‌ కో..  విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మాకు నీళ్లున్నా, లేకున్నా ఇతర ప్రాంతాలకు నీళ్లిచ్చిన గడ్డ రాయలసీమ. ఇప్పుడు కూడా న్యాయ రాజధానిని సాధించుకోకపోతే మరో వందేళ్లు వెనక్కి వెళ్తామని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు తన కుటిల బుద్ధిని మార్చుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా ఇవ్వరు. 

 కేవలం 29 గ్రామాలే అభివృద్ధి చెందాలా: ఎమ్మెల్సీ శివరామిరెడ్డి 
    ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. అమరావతిలో తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు కేవలం 29 గ్రామాలను చంద్రబాబు అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. మీకు కోర్టు వస్తే డబ్బాలు తప్ప ఏమి వస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఆ డబ్బాలనే మాకు ఇవ్వడానికి చంద్రబాబుకు ఎందుకంత ఇబ్బందో చెప్పాలి. విభజన తర్వాత ఎయిమ్స్‌ ఆస్పత్రి అనంతపురం జిల్లాకు కేటాయిస్తే దాన్ని మంగళగిరికి తరలించాల్సిన అవసరం ఏమిటో చంద్రబాబు చెప్పాలి. 

బాబుకు రాయలసీమపై ఏ మాత్రం ప్రేమలేదు: కాటసాని రాంభూపాల్‌ రెడ్డి 
    అనాది నుంచి రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపాలనే ఇవాళ గర్జన చేపట్టాం. ఈ రోజుకీ రాయలసీమకు సరైన న్యాయం జరగలేదు. ఇక్కడి ప్రజలందిరిలో న్యాయ రాజధాని తెచ్చుకోవాలనే దృఢమైన సంకల్పం ఉంది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. చంద్రబాబు తన హయాంలో శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కూడా నీటిని సీమకు ఇవ్వలేని దుస్థితి. బాబుకు రాయలసీమపై ఏ మాత్రం ప్రేమలేదు. ఆయన అత్తగారిల్లైన అమరావతి ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద తప్పితే, ఆ ప్రాంత అభివృద్ధిపైన కూడా  బాబుకు చిత్తశుద్ధి  లేదు. ఇప్పటికైన మించిపోయింది లేదు...వైఎస్‌జగన్‌ గారు ఇస్తున్న న్యాయ రాజధానికి చంద్రబాబు మద్దతు ఇవ్వాలి. 

సీమ వాసులు బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే శ్రీదేవి 
    కర్నూలు జిల్లా త్యాగాల జిల్లాగా మారింది. దశాబ్దాలుగా ఎన్నో నష్టాలను చవిచూశాం. ఆ రోజు  ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు నుంచి తొలగించి,  రాజధానిని హైదరాబాద్‌లో పెట్టుకుంటాం అన్నా తెలుగు వారి సమైఖ్యత కోసం పెద్ద మనసుతో ఒప్పుకున్న ప్రాంతం ఇది. ఈ రోజు కర్నూలులో జగనన్న హైకోర్టు ఇస్తానని చెప్పినా, కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. కొన్ని పత్రికలు రాయలసీమ వాసుల గురించి అవహేళనగా రాతలు రాస్తున్నారు. వీరందరికీ సీమ వాసులు బుద్ధి చెబుతారు. 

ఇదే ఉద్యమ స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తాం: మేయర్ బీవై రామయ్య
    రాయలసీమకు న్యాయం జరగాలి, సీమకు న్యాయ రాజధాని కావాలని చేపట్టిన గర్జనకు భారీ ఎత్తున ప్రజలు స్పందించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. వికేంద్రీకరణ జరిగితే భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుంది. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తాం.

తాజా వీడియోలు

Back to Top